
'సీమాంధ్రలో కింగ్స్, తెలంగాణలో కింగ్ మేకర్స్'
హైదరాబాద్: తెలంగాణలో తాము కింగ్ మేకర్లుగా అవతరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ అసెంబ్లీ, లోక్సభ స్థానాలను గెల్చుకునే అవకాశముందని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోందన్నారు. తెలంగాణలో తమకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వస్తాయని దీమా వ్యక్తం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి వస్తే వైఎస్ఆర్ సీపీ కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. తెలంగాణలో తాము కింగ్ మేకర్ పాత్ర పోషించబోతున్నామని అన్నారు. 'సీమాంధ్రలో మేం కింగ్స్, తెలంగాణలో కింగ్ మేకర్స్' అని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు.