
ప్రజల మేనిఫెస్టో అర్థం కాలేదా?
తమ పార్టీ మేనిఫెస్టో అర్ధం కావడంలేదని లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు.
హైదరాబాద్: తమ పార్టీ మేనిఫెస్టో అర్ధం కావడంలేదని లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. ప్రజల మేనిఫెస్టో మీకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టుగా మీ పార్టీని టీడీపీలో విలీనం చేయాలని జేపీకి సూచించారు. చంద్రబాబు చేతిలో పావులా జేపీ మారారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలని ఒక్కసారైనా డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. జేపీ వ్యాఖ్యలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని గట్టు రామచంద్రరావు అన్నారు.