
మోత్కుపల్లి నోరు అదుపులో పెట్టుకో:గట్టు
టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులుపై వైఎస్సార్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు.
హైదరాబాద్:టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులుపై వైఎస్సార్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. మోత్కుపల్లి నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తప్పుడు కూతలు కూయడంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతేక శిక్షణ పొందావా?అని గట్టు ప్రశ్నించారు. ఆకాశంపైకి ఉమ్మెస్తే ఏం జరుగుతుందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు విభజన వాదా?సమైక్యవాదా?చెప్పగలవా అని గట్టు నిలదీశారు. గతంలో బాబును తిట్టిన తిట్లు నీకు గుర్తులేవా?అని ప్రశ్నించారు.