motkupalli
-
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
-
‘సీఎం అదృష్ట సంఖ్య కోసం జిల్లాలా?’
సాక్షి, హైదరాబాద్: జిల్లాల సంఖ్య ప్రజల అవసరాలు తీర్చడానికా లేక సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య కోసమా అని టీటీడీపీ ప్రశ్నించింది. జిల్లాల విభజన పిప్పర్మెంట్ల పంపకాలను తలపిస్తోందని ఎద్దేవా చేసింది. తెలంగాణ ప్రజల బతుకు మారుస్తామని అధికారంలోకి రాగానే వాస్తు పేరుతో బంగ్లాలు, కలర్ల పేరుతో కార్లు మారుస్తూ, ఇప్పుడు అదృష్టసంఖ్య పేరుతో 20,26,27,30,33 జిల్లాలు అంటూ రోజుకో ప్రకటన చేస్తూ తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారని ధ్వజమెత్తింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. శాస్త్రీయ విధానం లేకుండా, రాజకీయ అవసరాలు, కుట్రలు, కుతంత్రాలతో ప్రత్యర్థులను దెబ్బతీయాలనే లక్ష్యంతో సీఎం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి: మోత్కుపల్లి తెలంగాణ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి పేరు మీద ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని హైపవర్ కమిటీ చైర్మన్ కేశవరావుకు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖలు పంపుతున్నట్లు చెప్పారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఆలేరు : ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆలేరులో శనివారం జరిగిన టీడీపీ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని.. ఇటీవల యాదాద్రి జిల్లా సాధన ప్రజల సహకరంతోనే సాధ్యమైందన్నారు. అలాగే ఆలేరు రైల్వేగేట్ విషయంలో 5వేల మందితో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. తాను ఎక్కడ ఉన్న ఆలేరు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. అలాగే యాదాద్రి జిల్లా ఏర్పాటైనందున యాదగిరిగుట్టలో అక్టోబర్ 2న అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే టీడీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి ప్రజల బాగోగులు పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో అమరేందర్‌రెడ్డి, ఇస్తారి, రాములు, సలీం, దానయ్య, బాలయ్య, మల్లేశం, మల్లేశం, సంతోష్, శ్రీను, పెద్దఉప్పలయ్య, రాజయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
యాదాద్రికే మొదటి ప్రాధాన్యం
యాదగిరిగుట్ట: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా యాదాద్రి జిల్లాకే మొదటి ప్రాధాన్యమివ్వాలని టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో ఏర్పాటు కానున్న యాదాద్రిని మొదటగా ప్రకటిస్తే రాష్ట్రంలో అన్ని శుభ పరిణామాలే జరుగుతాయని సూచించారు. ఆలేరు, భువనగిరి, రామన్నపేట నియోజకవర్గాలను కలుపుకుని జిల్లా ఏర్పాటు చేస్తే పరిపాలన బాగుటుందని వెల్లడించారు. యాదాద్రి జిల్లాలో పాత రెవెన్యూ కేంద్రమైన రామన్నపేటను కలపాలన్నారు. సమావేశంలో బండ్రు శోభరాణి, దడిగె ఇస్తారి, గొట్టిపర్తి మల్లేష్‌గౌడ్ తదితరులున్నారు. -
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: మోత్కుపల్లి
తుర్కపల్లి : ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జేఎం పంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్న రైతులకు రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో రూ. కోట్లు ఖర్చు చేస్తూ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మొక్కలు నాటడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని రక్షించడంలో చూపడం లేదని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూంల ఇళ్లు, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ విద్య, ఇంటికో ఉద్యోగం, కరెంట్ సబ్సీడీ, వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తుర్కపల్లి మండలంలో విలువైన ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతుందని ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి, జిల్లా నాయకులు వనందాస్ పాపయ్య, కళాశికం అమరేందర్, రఘు, సంజీవ, అమర్నా«ద్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై కేసీఆర్ కక్షగట్టారు
-
మాదిగ ద్రోహి కేసీఆర్: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మాదిగలను అంటరానివారిగా చూస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దొరతనంతో ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను బర్తరఫ్ చేశారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా ఎస్సీలను తొక్కిపట్టిన కేసీఆర్ ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను జీర్ణించుకోలేక ఆయనపై రుసరుసలాడుతూ చివరికి బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కులవివక్షత ఎక్కడో లేదని కేసీఆర్ వద్దే అది కనిపిస్తోందన్నారు. వరంగల్ సభలో తనకన్నా ముందే హెల్త్ యూనివర్సిటీపై రాజయ్య ప్రకటన చేసినప్పటి నుంచి ఆయనను మందలించడం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 600 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ ఉంటే మంత్రినే ఎందుకు బర్తరఫ్ చేశారని ప్రశ్నించారు. -
గరికపాటికి రాజ్యసభ సీటు ఖరారు
-
మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా?
-
మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా?
హైదరాబాద్ : టీడీపీలో నేతల మధ్య రాజ్యసభ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఆశావహులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రం నుంచి టిడిపికి దక్కనున్న రెండు సీట్లలో ఒక సీటును తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుండగా ఆ సీటును ఆశిస్తున్న తెలంగాణ టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. టిడిఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి, జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ నుండి సీనియర్ నేతగా తనకు ఈ దఫా రాజ్యసభకు ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ చంద్రబాబునాయుడును గట్టిగా కోరడం జరిగింది. అయితే దీనిపై బాబునుంచి సరైన హామీ రాకపోవటంతో మోత్కుపల్లికి రాజ్యసభ టిక్కెట్ దక్కడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో బాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కాగా తాజాగా జిల్లాకు చెందిన పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి, భువనగిరి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి సైతం రాజ్యసభ సీటు కోరుతు ఇటీవలే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి అభ్యర్థించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ భువనగిరి అసెంబ్లీ సీటు నుండి దివంగత మాధవరెడ్డి, తదుపరి తాను పార్టీని గెలిపించి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించామని తమ కుటుంబం పార్టీకి చేసిన సేవలు, త్యాగంను గుర్తించి రాజ్యసభకు తనకు అవకాశం కల్పించాలని ఉమా విన్నవించుకోవడం విశేషం. పార్టీలో మహిళలకు తగిన గౌరవం కల్పించే దిశగా సైతం సీనియర్ నేతగా తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఉమామాధవరెడ్డి అభ్యర్ధించారు. ఇక జిల్లా టిడిపిలో మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డికి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రాజ్యసభ సీటు పంచాయతీతో మరోసారి బహిర్గతమైంది. మధ్యలో టిడిపిని వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి సొంతగూటికి చేరిన మోత్కుపల్లి కంటే టిడిపి ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన భర్త మాధవరెడ్డితో పాటు తాను చేసిన సేవలే మిన్నయని తనకే రాజ్యసభ సీటు ఇవ్వాలని ఉమా కోరుతు పార్టీలో మోత్కుపల్లి ఆధిపత్యానికి మరోసారి ఆమె సవాల్ విసిరారు. ఉమా, మోత్కుపల్లిలతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి రాజ్యసభ సీటును ఆశిస్తున్న వారిలో గరికపాటి రాంమోహన్‌రావు కూడా ఉన్నారు. మరి తెలంగాణ నుంచి వీరిలో ఎవరికి రాజ్యసభ టిక్కెట్ వరిస్తుందో వేచి చూడాలి. -
మోత్కుపల్లి నోరు అదుపులో పెట్టుకో:గట్టు
హైదరాబాద్:టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులుపై వైఎస్సార్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. మోత్కుపల్లి నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తప్పుడు కూతలు కూయడంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతేక శిక్షణ పొందావా?అని గట్టు ప్రశ్నించారు. ఆకాశంపైకి ఉమ్మెస్తే ఏం జరుగుతుందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు విభజన వాదా?సమైక్యవాదా?చెప్పగలవా అని గట్టు నిలదీశారు. గతంలో బాబును తిట్టిన తిట్లు నీకు గుర్తులేవా?అని ప్రశ్నించారు.