యాదాద్రికే మొదటి ప్రాధాన్యం | first prefarence to yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికే మొదటి ప్రాధాన్యం

Aug 17 2016 10:22 PM | Updated on Sep 4 2017 9:41 AM

యాదాద్రికే మొదటి ప్రాధాన్యం

యాదాద్రికే మొదటి ప్రాధాన్యం

జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా యాదాద్రి జిల్లాకే మొదటి ప్రాధాన్యమివ్వాలని టీడీపీ జాతీయ పోలిట్‌ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

యాదగిరిగుట్ట: జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా యాదాద్రి జిల్లాకే మొదటి ప్రాధాన్యమివ్వాలని టీడీపీ జాతీయ పోలిట్‌ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో ఏర్పాటు కానున్న యాదాద్రిని మొదటగా ప్రకటిస్తే రాష్ట్రంలో అన్ని శుభ పరిణామాలే జరుగుతాయని సూచించారు. ఆలేరు, భువనగిరి, రామన్నపేట నియోజకవర్గాలను  కలుపుకుని జిల్లా ఏర్పాటు చేస్తే పరిపాలన బాగుటుందని వెల్లడించారు. యాదాద్రి జిల్లాలో పాత రెవెన్యూ కేంద్రమైన రామన్నపేటను కలపాలన్నారు. సమావేశంలో  బండ్రు శోభరాణి, దడిగె ఇస్తారి, గొట్టిపర్తి మల్లేష్‌గౌడ్‌ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement