
'చంద్రబాబు అరాచకవాది'
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఒక అరాచక వాదిగా మారాడాని టీఆర్‌ఎస్ నేత గట్టు రామచందర్‌రావు మండిపడ్డారు. బాబు వంటి అరాచక వాదులు రాజకీయాల్లో ఉండొద్దని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి రామారావు ఆశించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం గట్టు విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఎపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా బాబుకు లేదని అన్నారు. ప్రజలు హామీల మీద నిలదీస్తారన్న భయంతోనే ఏపీలో కాకుండా హైదరాబాద్‌లో మహానాడు నిర్వహించారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించేంత సీన్ బాబుకు లేదన్నారు. ఎన్టీఆర్‌కు ఉన్న లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు.