'ఇష్టం లేకపోతే విజయవాడ వెళ్లిపోవచ్చు' | better to go and rule from vijayawada, says mp kavitha | Sakshi
Sakshi News home page

'ఇష్టం లేకపోతే విజయవాడ వెళ్లిపోవచ్చు'

Published Wed, Feb 4 2015 3:03 PM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

'ఇష్టం లేకపోతే విజయవాడ వెళ్లిపోవచ్చు' - Sakshi

'ఇష్టం లేకపోతే విజయవాడ వెళ్లిపోవచ్చు'

హైదరాబాద్: హైదరాబాద్లో ఉండి పరిపాలన చేస్తుంటే విదేశాల్లో ఉండి పాలన చేస్తున్నట్లుగా ఉందని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించినట్లే ఉందని ఎంపీ కవిత అన్నారు. తన వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇష్టం లేకపోతే తక్షణమే విజయవాడ వెళ్లి పరిపాలన చేసుకోవచ్చని కవిత అన్నారు.

 హైదరాబాద్ను విదేశాలతో పోల్చిన చంద్రబాబు ... వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎలా అంటారని ఆమె ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని అంటే ప్రజలకు అందుబాటులో ఉండదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. కవిత బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కాగా హైదరాబాద్లో ఉండి పరిపాలన చేస్తుంటే ఇతర దేశాల్లో ఉండి పరిపాలన చేస్తున్నట్లు ఉందని చంద్రబాబు...ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా మంగళవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement