ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావుపై దాడి చేసిన ఏలూరు ఎంపీ మాగంటి బాబును వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణలోని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో గట్టు రామచంద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మాగంటి బాబు ఆయన గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.