
'తెలుగు జాతిని కాంగ్రెస్, బాబు అవమానిస్తున్నారు'
తెలుగుజాతిని కాంగ్రెస్... తెలుగుదేశం పార్టీ అవమానిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు.
ఢిల్లీ: తెలుగుజాతిని కాంగ్రెస్... తెలుగుదేశం పార్టీ అవమానిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకటే విధానమని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లాగా రెండు వైఖరులు ఉండవని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయని గట్టు ఆరోపించారు. విభజన వల్ల అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం 10.30 గంటలకు భేటీ కానుంది.