
'దమ్ముంటే తుమ్మల తన ఆస్తులపై విచారణ జరపాలి'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు పాలనలో చేసిన పాపం వల్లే ముమ్మాటికీ కృష్ణా జలాలు కోల్పోయామని ఆయన సోమవారమిక్కడ విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇటువంటి తీర్పు వచ్చేది కాదని గట్టు అన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులను ఎందుకు ఆపలేదని సూటిగా ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టిన ప్రాజెక్టులను తప్పుబడుతున్న చంద్రబాబు ఆనాడు ఎందుకు శంకుస్థాపనలు చేశారని గట్టు అన్నారు. టీడీపీ సమాధానం చెప్పలేక తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావుకు దమ్ముంటే తన ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని గట్టు ఈ సందర్భంగా సవాల్ విసిరారు.