తెలంగాణ మీ అబ్బ సొత్తా? జాగీరా?: గట్టు
తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై వైఎస్ఆర్సీపీ నేత గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ నీ అబ్బ సొత్తా.. నీ అబ్బ జాగీరా అంటూ గట్టు నిలదీశారు. తెలంగాణ సాయుధపోరాటంలో బీసీ, ఎస్సీ, మైనారిటీలపై భూస్వామ్య, పెట్టుబడిదారుల చేసిన అరాచకాలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.
రాజ్యంగపరమైన హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువలను కిరణ్ సర్కార్ కాలరాస్తోంది అని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చాంఫియన్ గా పోజులకొట్టే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. సోనియాగాంధీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను కిరణ్ సర్కార్ కాలరాస్తోంది అని విమర్శించారు.