తెలంగాణ ప్రాంతం జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిల జాగీరు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అక్కెనపల్లి కుమార్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రాంతం జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిల జాగీరు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అక్కెనపల్లి కుమార్ మండిపడ్డారు. అసలు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి, తెలంగాణ ప్రాంతంలో కూడా భారీ నష్టాలు సంభవించినా కూడా రైతుల కష్టనష్టాలను ఏమాత్రం పట్టించుకోని మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం హేయమైన చర్య అని వారు విమర్శించారు.
జరిగిన సంఘటనకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని, కాంగ్రెస్ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అక్కెనపల్లి కుమార్ డిమాండ్ చేశారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా.. మంత్రులు రాకపోగా వచ్చిన ఏకైక నాయకురాలు వైఎస్ విజయమ్మను అరెస్టు చేయించడం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు.