లగడపాటి సర్వే సన్నాసి సర్వే.... | Lagadapati rajagopal poll survey a fake, says gattu ramachandra rao | Sakshi
Sakshi News home page

లగడపాటి సర్వే సన్నాసి సర్వే....

Published Wed, May 14 2014 2:40 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

లగడపాటి సర్వే సన్నాసి సర్వే.... - Sakshi

లగడపాటి సర్వే సన్నాసి సర్వే....

హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ లగడపాటి సర్వే సన్నాసి సర్వే అని  వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వే బెట్టింగ్ల కోసమేనని అన్నారు. ఆయన రాజకీయాలు మానేసి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని గట్టు రామచంద్రారావు విమర్శించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని లగడపాటికి తెలుసునని, అయితే బెట్టింగ్ల ద్వారా సంపాదనే లక్ష్యంగా లగడపాటి సర్వే ఉందన్నారు. 16వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత లగడపాటి కమండలం పట్టుకుని హిమాలయాలకు వెళతారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని గట్టు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఇటువంటి సర్వేలన్ని రివర్స్ అవ్వడం ఖాయమన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement