
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా మహాకూటమికి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2 నెలల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్నారని తెలిపారు.
క్షేత్రస్థాయిలో ఓటేయాలని అడిగే స్థాయి కూడా లేని కూటమి నేతలు ప్రజల్లో అభాసుపాలవుతారన్నా రు. తెలంగాణను విచ్ఛిన్నం కాకుండా చూసి అభివృద్ధి ఫలాలను అన్నివర్గాలకు పంచిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆరేనని అన్నారు.