
రాజకీయ అజ్ఞాని నారా లోకేష్ : గట్టు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి, సత్తా కానీ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. లోకేష్ రాజకీయ అజ్ఞానివి అంటూ దుయ్యబట్టారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కేసుల నుంచి తప్పుంచుకున్న చరిత్ర మీ నాన్న చంద్రబాబుదంటూ గట్టు రామచంద్రరావు ఘాటుగా విమర్శించారు.
మీనాన్న అవినీతి డబ్బుతో నిన్ను చదివించింది నిజం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో నీవు, మీ నాన్న ఉన్నారు కానీ... మీకు సొంతంగా పార్టీ పెట్టే సత్తా ఉందా? అని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు.