
మీ ఎంపీలే...మిమ్మల్ని కొడుతుంటే బాబు ఏం చేస్తున్నారు?
నరసరావు పేట ఎంపీ, టీడీపీ నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్లే దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు తెలిపారు. అంతేకాని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి హితవు పలికారు.
అయిన మీ పార్టీ ఎంపీలే మిమ్మల్ని కొడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబుతో ఇప్పటికేనా జై సమైక్యాంధ్ర అనిపించగలరా అంటు మోదుగులకు ఆయన సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ బ్రోకర్ పార్టీగా మారిందని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు.