
చంద్రబాబు తుపాకి రాముడు: గట్టు
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తుపాకి రాముడు'' అని గట్టు ఎద్దెవా చేశారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన గురించి ఏనాడు చెప్పుకోడని గట్టు అన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి ఎలా పెరిగిందో ఎకనమీ సర్వే చూస్తే తెలుస్తుందని చెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని గట్టు తెలిపారు. టీడీపీ ఒక డ్రామా కంపెనీగా గట్టు అభివర్ణించారు. ప్రపంచంలో ఎవరు గెలిచిన సంబరాలు చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైందని గట్టు రామచంద్రరావు విమర్శించారు.