ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గం పైపాళ్యం గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని, రాత్రి 9 గంటల ప్రాంతంలో గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెలోని లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. తొలుత పైపాళ్యం చేరుకుని వెంకటేష్ భార్య రాణెమ్మ, కుమార్తె విజయశాంతి, కుమారుడు మనిరత్నంలను ఆప్యాయంగా పలకరించారు. గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెలో వెంకటేష్ భార్య లక్ష్మి(45) వైఎస్సార్ మరణవార్త విని గుండెపోటుతో మృతి చెందారు. జగన్‌మోహన్‌రెడ్డి కంచిబందార్లపల్లెలోని లక్ష్మి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. ఎలాంటి కష్టమొచ్చినా తనను సంప్రదించాలని ఫోన్ నంబర్ ఇచ్చారు.
కవలలకు నామకరణం
కంచిబందార్లపల్లెలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరు ఆడపిల్లలకు నామకరణం చేశారు. సల్లాపురెప్ప, అంజమ్మ దంపతుల కవల పిల్లలకు తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల పేర్లు పెట్టారు. తమ అభిమాన నేత కుటుంబ సభ్యుల పేర్లను పెట్టడంతో సల్లాపురెప్ప కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
జగన్ వెంట మా పెద్దిరెడ్డి రామద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమ కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పలవునేరు, తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యేలు అమనాథరెడ్డి, ప్రవీణ్‌కుమాడ్డి, కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి సుబ్రమణ్యంరెడ్డి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవీ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు జింకా వెంకటాచలపతి, సెంథిల్ తదితరులు ఉన్నారు.