ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడటానికైనా నాయకుడతడు. తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంతదూరమైన వెళ్లగల అలుపెరగని బాటసారి.
ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడటానికైనా నాయకుడతడు. తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంతదూరమైన వెళ్లగల అలుపెరగని బాటసారి. తన వారికి 'ఓదార్పు' ఇచ్చేందుకు ఒడిదుడుకులు ఎదురైనా లెక్కచేయని ధీశాలి. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం పోరాటం చేస్తున్న ప్రజా నాయకుడు. రాష్ట్ర ప్రజల అశేష ఆదరాభిమానాలు సంపాదించుకున్న జననేత. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా సర్వశక్తులు ఓడ్డుతున్న సాహస నాయకుడు. 227 రోజులు.. 16,707 కిలోమీటర్లు ప్రయాణించి జన'కోటి'కి ఓదార్పునిచ్చిన అలుపెరగని బాటసారి. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
మహానేత వైఎస్ రాజశే్ఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను ఓదారుస్తానని పావురాలగుట్టలో జగన్ మాట ఇచ్చారు. అన్నమాట ప్రకారం ఓదార్పుయాత్ర చేపట్టారు. ఎండ, వాన, చలిని కూడా లెక్కచేయకుండా.. పగలనక, రాత్రనక పర్యటించారు. నిద్ర లేకుండా తెల్లవార్లూ పర్యటించిన సందర్భాలున్నాయి. భద్రతను సైతం లెక్కచేయకుండా మారుమూల పల్లెలకు పోయి పరామర్శించారు. నేనున్నా అంటూ భరోసా యిచ్చారు. జగన్ ఓదార్పుకు జనం చలించిపోయారు. తమ వాడిగా అక్కున చేర్చుకున్నారు. అమితమైన ప్రేమ చూపారు.
ప్రజలు తన పట్ల చూపించిన ఆత్మీయాను రాగాలకు జగన్ చలించిపోయారు. ఎన్ని రకాల ఒత్తిడిలు వచ్చినా లెక్కచేయకుంగా ఓదార్పుయాత్ర సాగించారు. రాజకీయంగా, వ్యాపారపరంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేసిన మహానేత తనయుడు మాటకే కట్టుబడ్డాడు. తనకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక 'ఢిల్లీ పెద్దలు' పెట్టిన ఆంక్షలను ఎదిరించి ఓదార్పు కొనసాగించారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లేందుకు కూడా ఆయన వెనుకాడలేదు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళతానని చెప్పడమే కాదు- రుజువు చేసిన నేత జగన్. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన ఓదార్పు యాత్ర కొనసాగిస్తుండడం విశేషం. అందుకోసమే ప్రజలు ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.