
అడుగడుగునా ఆదరణ
- మహానేతను గుర్తుకు తెచ్చుకున్న జనం
- జగన్ ప్రసంగానికి జనం జేజేలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత పర్యటనలో భాగంగా ఏడో రోజు సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో చేసిన ప్రసంగం ప్రజ లను విశేషంగా ఆకట్టుకుంది. ఆయనకు అడుగడుగునా ఆదరణ లభించింది. జగన్‌మోహన్‌రెడ్డితోనే మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సువర్ణయుగం వస్తుందని ప్రజలు విశ్వా సం వ్యక్తం చేశారు. ఐరాల, తవణంపల్లె మండలాల్లో జరిగిన జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు అడుగడుగునా ఆదరణ లభించింది. అరగొండలో ఆయన మహానేత వైఎస్.రాజ శేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంతో ఆ ప్రాంతవాసులు ఉత్తేజితులయ్యారు. వైఎస్‌రాజశేఖరరెడ్డి సేవల ను గుర్తుచేసిన ప్రతిసారీ జేజేలు పలికారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేదరికాన్ని అతి దగ్గరగా చూశారని, ఆయన రాష్ట్రంలో 1600 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి పేదవాడి కష్ట సుఖాలను తెలుసుకున్నారని అనగానే, అవును..అవును అంటూ జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎన్నో గొప్ప పథకాలను చేపట్టారని అనగానే వైఎస్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. వైఎస్ ఒక తం డ్రిగా, అన్నగా ప్రజలకు ఎన్నో కార్యక్రమాలను అందించారని తెలిపారు.
రాముని రాజ్యం మనం చూడలేదు కానీ, రాజన్న సువర్ణ యుగాన్ని చూశామని అనగానే హర్షధ్వానాలు మిన్నంటాయి. ప్రతి పేద ాడు సరైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లి, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని అన్నారు. తరువాత ఆ ఖర్చుకు పది రూపాయల వడ్డీ కట్టే వారని అన్నారు. ఈ అవసరం లేకుండా పేదవాడి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్‌రాజశేఖరరెడ్డిదేనని అనడంతో.. వైఎస్సార్ అమర్ రహే అంటూ జేజే లు పలికారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సమన్వయకర్తలు ఆదిమూలం, సునీల్ కుమార్, రాజంపేట పార్లమెంటరీ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, యువజన విభాగం కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, రవిప్రసాద్, బీరేంద్ర, పైమాఘం సుగుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌ను చూసినట్లే ఉంది..
జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంపై అరగొండకు చెందిన ప్రజలు స్పందించారు. అరగొండ వెంకటరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని చూసినంత సేపు, వైఎస్‌రాజశేఖరరెడ్డిని చూసినట్లు ఉందని అన్నారు. వైఎస్ తమ కళ్ల ముందు మెదిలారని తెలిపారు. వైఎస్ ఎక్కడికో పోలేదని, తమ గుండెల్లోనే ఉన్నారని తెలిపారు. అదే గ్రా మానికి చెందిన రాఘవయ్య మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిపై తమకు నమ్మకం ఉందని, ఆయన రాజశేఖరరెడ్డి పాలనను మరోసారి తీసుకుని వస్తారని అన్నారు. మంచి పాలనను అందజేయగలిగే శక్తి వైఎస్‌కుటుంబంలోనే ఉందని అన్నారు. అందుకే ఇంత మంది జనం జగన్‌మోహన్‌రెడ్డిని అభిమానిస్తున్నారని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.