మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తను జీర్ణించుకోలేక అసువులు బాసిన రెడ్డి గౌస్ కుటుంబాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.
చిత్తూరు : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తను జీర్ణించుకోలేక అసువులు బాసిన రెడ్డి గౌస్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురానికి చెందిన రెడ్డి గౌస్.. వైఎస్ ఇక లేరన్న వార్త విని.. ప్రాణాలు విడిచాడు. గౌస్ మృతితో కుటుంబానికి బాసట కరువైంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న గౌస్ కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. తోడుగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
మరోవైపు జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర మంగళవారం పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. గంగాదొడ్డిలో రామచంద్రకుటుంబాన్ని ఓదారుస్తారు. పీలేరులోని గాంధీ సర్కిల్ లో బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. సమైక్య శంఖారావం యాత్రకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. అక్కడ్నుంచి ఓల్డ్ డిగ్రీ కాలేజ్, చింతపర్తి, గండబపోయినపల్లిలో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తూ కలికిరి చేరుకుంటారు. కలికిరి బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం కలికిరిరెడ్డివారిపల్లిలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించి కందూరులో రాత్రిబస చేస్తారు.