‘కందుకూరు’లో కాంగ్రెస్ ఖాళీ | cogress impty in kandukur | Sakshi
Sakshi News home page

‘కందుకూరు’లో కాంగ్రెస్ ఖాళీ

Published Sat, Apr 26 2014 4:39 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

‘కందుకూరు’లో కాంగ్రెస్ ఖాళీ - Sakshi

‘కందుకూరు’లో కాంగ్రెస్ ఖాళీ

 కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని 12 పంచాయతీల్లో 737 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఓవీ రోడ్డులోని ఆళా వారి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పోతుల రామారావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోతుల రామారావు మాట్లాడుతూ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపించకుండా పోయిందన్నారు.

 పార్టీలో చేరింది వీరే..  
 విక్కిరాలపేట నుంచి ఎడ్లూరి మధుబాబు, చినవెంకట్రావు, సురేంద్రబాబు, యరమాల కొండయ్య, యరమాల హుస్సేన్‌ల ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్సార్ సపీలో చేరాయి. జి.మేకపాడు నుంచి సర్పంచ్ బుసిరెడ్డి నాగేశ్వరరెడ్డి, పాలవెల్లి యలమందారెడ్డి, ఉపసర్పంచ్ రాశపూడి బుజ్జమ్మ, వార్డు మెంబర్లు కాలే మాలకొండయ్య, కరేటి రమణయ్య, గుమ్మా సుబ్బులు, చేరుకూరి వెంకటసుబ్రహ్మణ్యం, సింగిల్ విండో డెరైక్టర్ గూడపాటి నాగలక్ష్మిల ఆధ్వర్యంలో 125 కుటుంబాలు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకున్నాయి.

పాలూరు-దొండపాడు నుంచి సర్పంచ్ గోసల వెంకారెడ్డి, వాకా శ్రీనివాసులరెడ్డి, మాజీ సర్పంచ్ ఎలిచర్ల మాలకొండయ్య, జి.శ్రీనివాసులరెడ్డి, వీసం వెంకట్రావు తదితరుల ఆధ్వర్యంలో 175 కుటుంబాలు, కొండి కందుకూరు నుంచి సర్పంచ్ గుమ్మా సుశీల, మాజీ సర్పంచ్ మాడుగోలు రామారావు, బి.చినబ్రహ్మయ్య, బి.అంజయ్య, ఏ.మౌలాలీ, జువ్విగుంట రమేష్, మెండా ప్రకాశరావు, మెడబలిమి వెంకటేశ్వర్లు, సుదర్శి రామకృష్ణ, రమేష్, జువ్విగుంట రవీంద్ర, గౌడపేరు ఆనందరావు, బ్రహ్మయ్య, మాల కొండయ్య తదితరుల ఆధ్వర్యంలో 130 కుటుంబాలు, ఆనందపురం, శ్యామీరపాలెంల నుంచి తల్లమనేని శ్రీనివాసరావు, రావుల నరసింగరావు, మహేష్, ముప్పరాజు శ్రీనివాసరావు, పువ్వాడి రషీబాబు, ముప్పరాజు ప్రతాప్ తదితరుల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి.

 కమ్మవారిపాలెంలో కమ్మ రాఘవులు, బి.బాపూజీ, పోకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కమ్మ వెంకటేశ్వర్లు, కసుకుర్తి మాలకొండయ్య, బి.లక్ష్మయ్యల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, బలిజపాలెంలో బుర్రి రమణయ్య, పంది నాగేశ్వరరావు, తోకల లక్ష్మయ్య, శ్రీను, పూర్ణయ్య, ఏకాబ్రం సాంబయ్య, తోకల కోటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో 32 కుటుంబాలు, జిల్లెళ్లమూడి నుంచి రాఘవులు, గొర్రెపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 50, పందలపాడులో 30, కోవూరు వెంకట్రావు, రమణారెడ్డి, కోటి ల ఆధ్వర్యంలో 20, మహదేవపురం నుంచి 15 కుటుంబాలు కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరాయి.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి, పార్టీ మండల కన్వీనర్ పువ్వాడి వెంకటరమణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు కూనం కృష్ణారెడ్డి, వరికూటి కొండారెడ్డి, ప్రచార కమిటీ మండల అధ్యక్షుడు కూనం వెంకటరామిరెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, కటకం సూర్యం, గొంది నరసింగరావు, చీమల రాజా, దగ్గుమాటి కోటయ్య, వై.మాచర్లయ్య, కాపులూరి మురార్జి, ఆల్లం రాధయ్య పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కనకం శ్రీనివాసులు కూడా తన అనుచరులతో పోతుల రామారావు సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement