ponchos
-
విద్యార్థుల మెడలో టీడీపీ హారం
నెహ్రూనగర్ (సంతమాగులూరు): రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవుంటుందా! పైసలకు కొరతుంటుందా! అధికారమే చేతుల్లో ఉంటే పగలు రాత్రీ తేడా ఉంటుందా.. కార్యకర్తకు, చిన్నారులకు వ్యత్యాసం ఉంటుందా!.. అవునండీ సంతమాగులూరు మండలం.. కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌కు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించేందుకు శుక్రవారం వస్తున్నట్లు స్థానిక టీడీపీ నేతలకు సమాచారం అందింది. ఇంకేముందీ చేతులు, కాళ్లు ఆడలేదు. ఆయన్ను ఎలాగైనా ఒప్పించాలనుకున్నారు.. మెప్పించాలనుకున్నారు. గతంలో మంజూరైన సీసీ రోడ్డును ఎలాగైనా పూర్తి చేసి ఎమ్మెల్యేతో ప్రారంభింపజేయాలని సర్పంచ్ భర్త గుంజి లక్ష్మయ్య భీష్మించారు. ఇంకా అడ్డేముంది. గురువారం అర్ధరాత్రి పనులు చేపట్టేశారు. అక్కడ కనీసం అధికారులు ఉన్నారా.. పర్యవేక్షిస్తున్నారా అని కూడా పట్టించుకోలేదు. అర్ధరాత్రి సమయంలో పూర్తి చేసిన సీసీ రహదారి సుమారు రూ. 8 లక్షల రోడ్డును తెల్లారే సరికే పూర్తి చేశారు. వాస్తవంగా నాణ్యతతో సీసీ రోడ్డు వేస్తే రెండు లేదా లేదా మూడురోజులు పడుతుంది. కానీ నెహ్రూనగర్‌లో వేసిన 150 మీటర్లు రోడ్డు మాత్రం ఒక్క రాత్రిలో ప్రత్యక్షం అయింది. తెల్లారింది.. నాయకులంతా హడావుడిగా చేస్తున్నారు. మరోవైపు పక్కనే ఉన్న గవర్నమెంటు స్కూలు బెల్లు గణగణమంది. పిల్లలంతా బిరబిరమంటూ వచ్చేశారు. ఎమ్మెల్యే వస్తున్నారంటూ టీచర్లకూ వణుకు మొదలైంది. వెంటనే కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ‘రేయ్ ఈ టీడీపీ కండువాలు మీ మెడలో వేసుకోండి. మా అన్న ఎమ్మెల్యే ఫొటో ఉన్న స్టిక్కర్లను మీ చొక్కాలకు పెట్టుకోండి’ అంటూ వాటిని అంటించేశారు. అవేంటో కూడా తెలియని పిల్లలు సరదా పడ్డారు. వాళ్లు చెప్పినట్లు చేశారు. చూసిన జనం మాత్రం నవ్వుకున్నారు. అధికారం ఉంటే ఇలాగే ఉంటుందిలే అని సెటైర్లు వేసుకున్నారు. -
సిరిసిల్ల వస్త్రానికి ఎన్ని‘కళ’
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎన్నికల గాలితాకింది. వరుసగా ఎన్నికలు రావడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి కళ వచ్చింది. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులకు చేతినిండా పని లభిస్తోంది. రాజకీయపార్టీలు వినియోగించే బ్యానర్లు, జెండాలు, కండువాలు తయారీకి అవసరమైన గుడ్డ సిరిసిల్లలోనే ఉత్పత్తికావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్డ మన రాష్ట్రంతో పాటు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతోంది. న్యూస్‌లైన్, సిరిసిల్ల,రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7వేల మగ్గాలపై కాటన్ గుడ్డ ఉత్పత్తి అవుతోంది. పాతికవేల కుటుంబాలు వస్త్రోత్పత్తి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. నూలు ధరలు పెరగడం, ఉత్పత్తి చేసిన గుడ్డకు గిరాకీ లేక వస్త్ర వ్యాపారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు పెరిగి విడిభాగాల రేట్లు ఎక్కువై వస్త్రోత్పత్తి గిట్టుబాటు లేని పరిస్థితి గతంలో ఎదురైంది. ఇప్పుడు గుడ్డకు కాస్త ధర పెరగడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి స్థానిక, మున్సిపల్, సార్వత్రిక న్నికలు రావడంతో వస్త్రవ్యాపారులకు కలిసొచ్చింది. సిరిసిల్లలో నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తవుతుండగా, గతంలో వస్త్ర నిల్వలు అమ్మకాల్లేక పేరుకుపోయాయి. ఎన్నికల పుణ్యమా.. అని ఇప్పుడు వస్త్ర నిల్వలన్నీ హైదరాబాద్‌లోని మార్వాడి సేట్లు కొనుగోలు చేయడంతో గుడ్డనిల్వలు లేకుండా పోయాయి. ఎన్నికల పుణ్యమా అని.. ఎన్నికలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు, కండువాలు, క్యాప్‌లకు చౌకగా లభించే గుడ్డ అవసరమవుతోంది. సిరిసిల్లలో నాసిరకం గుడ్డ ఉత్పత్తవుతుండగా, జాతీయ మార్కెట్లో సిరిసిల్ల గుడ్డను ఎన్నడూలేని విధంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా కొనుగోలు చేయడం పరిపాటి. దీంతో సిరిసిల్ల వస్త్రానికి గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని లభిస్తోంది. పాలిస్టర్ వస్త్రానికి డిమాండ్ ఉండడంతో కార్మికులతో యజమానులు, ఆసాములు పని చేయిస్తున్నారు. సిరిసిల్లలో 8గంటల పని విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా, గుడ్డకు డిమాండ్ ఉండడంతో 12 గంటలు పని చేయిస్తున్నారు. మరో మూడు నెలల వరకు కార్మికులకు పని ఉంటుందని భావిస్తున్నారు. సిరిసిల్లలో తక్కువ ధరకు గుడ్డ దొరుకుతుండగా, ఆ గుడ్డను రంగుల్లో ప్రింట్ చేసేందుకు ప్రాసెసింగ్ చేయడానికి మీటర్ రూ.10 వరకు ఖర్చవుతోంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మిల్లుల్లో ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతోంది. మొత్తంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించింది. -
‘కందుకూరు’లో కాంగ్రెస్ ఖాళీ
కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని 12 పంచాయతీల్లో 737 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఓవీ రోడ్డులోని ఆళా వారి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పోతుల రామారావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోతుల రామారావు మాట్లాడుతూ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపించకుండా పోయిందన్నారు. పార్టీలో చేరింది వీరే.. విక్కిరాలపేట నుంచి ఎడ్లూరి మధుబాబు, చినవెంకట్రావు, సురేంద్రబాబు, యరమాల కొండయ్య, యరమాల హుస్సేన్‌ల ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్సార్ సపీలో చేరాయి. జి.మేకపాడు నుంచి సర్పంచ్ బుసిరెడ్డి నాగేశ్వరరెడ్డి, పాలవెల్లి యలమందారెడ్డి, ఉపసర్పంచ్ రాశపూడి బుజ్జమ్మ, వార్డు మెంబర్లు కాలే మాలకొండయ్య, కరేటి రమణయ్య, గుమ్మా సుబ్బులు, చేరుకూరి వెంకటసుబ్రహ్మణ్యం, సింగిల్ విండో డెరైక్టర్ గూడపాటి నాగలక్ష్మిల ఆధ్వర్యంలో 125 కుటుంబాలు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకున్నాయి. పాలూరు-దొండపాడు నుంచి సర్పంచ్ గోసల వెంకారెడ్డి, వాకా శ్రీనివాసులరెడ్డి, మాజీ సర్పంచ్ ఎలిచర్ల మాలకొండయ్య, జి.శ్రీనివాసులరెడ్డి, వీసం వెంకట్రావు తదితరుల ఆధ్వర్యంలో 175 కుటుంబాలు, కొండి కందుకూరు నుంచి సర్పంచ్ గుమ్మా సుశీల, మాజీ సర్పంచ్ మాడుగోలు రామారావు, బి.చినబ్రహ్మయ్య, బి.అంజయ్య, ఏ.మౌలాలీ, జువ్విగుంట రమేష్, మెండా ప్రకాశరావు, మెడబలిమి వెంకటేశ్వర్లు, సుదర్శి రామకృష్ణ, రమేష్, జువ్విగుంట రవీంద్ర, గౌడపేరు ఆనందరావు, బ్రహ్మయ్య, మాల కొండయ్య తదితరుల ఆధ్వర్యంలో 130 కుటుంబాలు, ఆనందపురం, శ్యామీరపాలెంల నుంచి తల్లమనేని శ్రీనివాసరావు, రావుల నరసింగరావు, మహేష్, ముప్పరాజు శ్రీనివాసరావు, పువ్వాడి రషీబాబు, ముప్పరాజు ప్రతాప్ తదితరుల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. కమ్మవారిపాలెంలో కమ్మ రాఘవులు, బి.బాపూజీ, పోకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కమ్మ వెంకటేశ్వర్లు, కసుకుర్తి మాలకొండయ్య, బి.లక్ష్మయ్యల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, బలిజపాలెంలో బుర్రి రమణయ్య, పంది నాగేశ్వరరావు, తోకల లక్ష్మయ్య, శ్రీను, పూర్ణయ్య, ఏకాబ్రం సాంబయ్య, తోకల కోటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో 32 కుటుంబాలు, జిల్లెళ్లమూడి నుంచి రాఘవులు, గొర్రెపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 50, పందలపాడులో 30, కోవూరు వెంకట్రావు, రమణారెడ్డి, కోటి ల ఆధ్వర్యంలో 20, మహదేవపురం నుంచి 15 కుటుంబాలు కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి, పార్టీ మండల కన్వీనర్ పువ్వాడి వెంకటరమణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు కూనం కృష్ణారెడ్డి, వరికూటి కొండారెడ్డి, ప్రచార కమిటీ మండల అధ్యక్షుడు కూనం వెంకటరామిరెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, కటకం సూర్యం, గొంది నరసింగరావు, చీమల రాజా, దగ్గుమాటి కోటయ్య, వై.మాచర్లయ్య, కాపులూరి మురార్జి, ఆల్లం రాధయ్య పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కనకం శ్రీనివాసులు కూడా తన అనుచరులతో పోతుల రామారావు సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు.