ప్రజలతో మమేకమవ్వండి
విజయనరగం మున్సిపాలిటీ: నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చా రు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూ చించారు. మంగళవారం ఆయ న తన నివాసగృహం ఆవరణ లో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కోలగట్ల మాట్లాడుతూ ఏ ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉందో గుర్తించి, అక్కడ పార్టీ బలోపేతానికి కృ షి చేయాలన్నారు.
ఇందుకు పార్టీలో చురుగ్గా పని చేసే వారికి గ్రామ, మండల, వార్డుస్థాయి కమిటీల్లో స్థానం కల్పిస్తామని చెప్పారు. తద్వారా రాష్ట్రం లోనే విజయన గరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని ఆ కాంక్షించారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని సూచించా రు. ప్రధానంగా ఏ ఒక్కరి ప్రయోజనాలకు కాకుండా పది మందికి ఉపయోగపడే పనులు చేపట్టాలని తెలి పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీలో ఉంటున్న కా ర్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ అమలు చేసే పింఛ న్లు, ఇళ్ల మంజూరు, రేషన్‌కార్డులు, తదితర సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ నాయకుల మాయ మాటల వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. పార్టీలో ఉన్న వారిలో ధైర్యాన్ని నింపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ట్టు తెలిపారు. జిల్లాలో పార్టీకి సమర్థమైన నాయకత్వం ఉందని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల పక్షా న పోరాటం చేయడంలో భాగంగా ప్రభుత్వాన్ని నిల దీసేందుకు సంసిద్ధులు కావాలని సూచించారు. పార్టీ నాయకుడు కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ పార్టీలో ఉన్న నాయకులంతా కార్యకర్తలను ఉత్తేజపరిచే విధం గా నడుచుకోవాలన్నారు. పార్టీ నాయకుడు మామిడి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు అవ నాపు విక్రమ్, కౌన్సిలర్ ఎస్‌వివి రాజేష్, ఆశపు వేణు, నరేష్, బోడసింగి ఈశ్వరరావు, జమ్ము శ్రీను, సోము కోటేశ్వరరావు, బంగారునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
28న జిల్లా పార్టీ సమావేశం: కోలగట్ల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి సమావేశం ఈ నెల 28వ తేదీన పట్టణంలోని ఆర్‌కె ఫంక్షన్ హాల్‌లోజరగనున్నట్టు కోలగట్ల ప్రకటించారు. ఆ రోజు ఉద యం 10 గంటలకు జరిగే సమావేశానికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని సూ చించారు. అలాగే ఈనెల 5న రాజమండ్రిలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ స మీక్షలో తనను జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరగా .. మరో ఆరు నెలలు వ్యవధి కావాలని, ఆ సమయం లోనియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పినట్టు తెలిపారు.