ఆత్మీయ పలకరింపు
- ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
- తరలి వచ్చిన పార్టీ శ్రేణులు
విమానాశ్రయం (గన్నవరం) : వైఎస్సార్‌సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నాయకులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం గన్నవరం విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలో రెండు రోజుల పాటు జరుగనున్న సమీక్ష సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానంలో ఉదయం 9 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు.
విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయనకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు మహిళలు, యువకులు ఉత్సాహం చూపారు.
విమానాశ్రయ ఆవరణలో పార్టీ శ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన అనంతరం ప్రత్యేక వాహనంలో గుంటూరు బయలుదేరివెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ఉప్పులేటి కల్పన, మేకా వెంకటప్రతాప్‌ఆప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జిల్లా పరిషత్ ప్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ విభాగం కన్వీనర్ ఎంవిఎస్. నాగిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, గుంటూరు నగర, జిల్లా కన్వీనర్లు లేళ్ళ అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, నియోజకవర్గ పార్టీ సమన్వకర్తలు వంగవీటి రాధాకృష్ణ, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పి. గౌతమ్‌రెడ్డి, మేరుగ నాగర్జున, అన్నభత్తుల శివకుమార్, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు దేవభక్తుని సుబ్బారావు, కోటగిరి గోపాల్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, డైమండ్ బాబు, ఎం. శేషగిరి, మేచినేని బాబు, నీలం ప్రవీణ్‌కుమార్, విజయవాడ నగర కార్పొరేటర్ అవుతు శైలజ, కాటంనేని పూర్ణచంద్రరావు, ఎండి. గౌసాని, లుక్కా ప్రసాద్ తదితరులున్నారు.