Welcomed
-
ఏమతమైన అందరం ఒక్కటే!... అంటే ఇదేనేమో! వీడియో వైరల్
ఇంతవరకు మనం ఎన్నో వీడియోలను చూశాం. కానీ ఈ వీడియో మనకోక గొప్ప సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మనమంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. కొన్నిసారు పెద్ద పెద్ద నేతలు మనమందరం సమానం అంటూ పెద్దపెద్ద మాటాలు మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ నోటి మాటల వరకే పరిమితం. వాస్తవిక రూపంలో చాలా వేరుగా ప్రవర్తింస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వీడియో వాస్తవికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పేలా ఉంది. ఇంతకీ ఆ వీడియయోలో ఏముందంటే....ముస్లీంలకు హజ్ యాత్ర అనేది అత్యంత పవిత్రమైనది. ప్రతి ముస్లీం జీవితంలో ఒక్కసారైన హజ్‌యాత్ర చేయాలనుకుంటాడు. ఐతే ఈ మేరకు సౌదీ అరేబియాలోని మక్కా(హజ్) యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముస్లీం సోదరులకు కాశ్మీరీ హిందువులు ఘనంగా స్వాగంత పలికారు. ఈ మేరకు కాశ్మీరీ పండిట్లు విమానాశ్రయం వెలుపలు ఉండి...స్వాగతం పలుకుతూ... ప్రవక్త మహ్మద్‌ను ప్రశంసిస్తూ కవిత్వం చెప్పారు. వారు తీర్థయాత్రను విజయవంతం చేసుకుని తిరిగి వచ్చినందుకు గూలాబీ పూలు ఇస్తూ అభినందనలు చెప్పారు. అంతేకాదు వారికి హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇస్తూ.. ఆహ్వానం పలికారు కూడా. ఈ వీడియోని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారీ పోస్ట్ చేస్తూ...మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ సోదరుల ప్రేమ పై రాజీకీయాల చెడు దృష్టి పడుకుడదని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అన్సారీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నేతగా ఉత్తరప్రదేశ్‌లోని మౌ సదర్ నియోజకవర్గానిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. हज करके लौटे हाजी लोग श्रीनगर एयरपोर्ट से निकले तो कश्मीरी पंडित भाईयों ने नात पढ़ते हुए आरती उतार कर उनका स्वागत किया और मुबारकबाद दी। इस मुहब्बत को राजनीति की नज़र ना लगे। pic.twitter.com/Oo338QsrlV — Abbas Bin Mukhtar Ansari (@AbbasAnsari_) July 16, 2022 (చదవండి: ఆ చిన్నారి చేసిన పని చూస్తే... నోట మాట రాదు!వీడియో వైరల్) -
సర్జికల్ స్ట్రైక్స్-2పై హర్షం వ్యక్తం చేస్తున్న దేశ ప్రజలు
-
జైషే మహ్మద్ స్థావరాలపై కూడా దాఘి చేయాలి
-
ఉపాధ్యాయ సంఘాల హర్షం
హైదరాబాద్: ఏకీకృత సర్వీసు రూల్స్‌కు సంబంధించిన ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతకం చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. దీనిపై రాష్ట్రపతికి, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు ధన్యవాదాలు తెలిపాయి. ఉపాధ్యాయుల చిరకాల కోరిక తీరిందని పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి అమల్లోకి తేవాలని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి, పీఆర్టీయూ–తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్‌రాజు, టీటీఎఫ్ నేతలు రామచంద్రం, రఘునందన్, టీటీయూ నేతలు మణిపాల్‌రెడ్డి, నరసింహస్వామి తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి’తో టీచర్లకు మేలు: పాతూరి తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమల్లోకి వస్తే టీచర్లకు మేలు జరుగుతుందని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడంపై పాతూరి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో నాలుగు దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభించినట్టయిందని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
నోట్ల రద్దును దేశం స్వాగతించింది
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన డీమానిటైజేషన్ ప్రక్రియను దేశం స్వాగతించిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజలు అద్భుతంగా సహకరించాన్నారు. సెక్యూరిటీ కరెన్సీముద్రణ కొంత ఎక్కువ సమయంతో కూడుకున్న పని అనీ, అయినా నగదు సరఫరాలో ఆర్ బీఐ చురుకు గా పనిచేస్తోందని ఆర్థికమంత్రి భరోసా ఇచ్చారు. మానిటైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, భారతదేశ వ్యాపార భారీగా ప్రభావితం కానుందన్నారు. డిజిటల్ అయిన పన్ను వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. ఇక ప్రతీ చిన్న లావాదేవీ నమోదుకావడంతో పన్ను పునాది విస్తృత మవుతుందన్నారు. ఫలితంగా పన్ను రేట్లు దిగిరానున్నాయని జైట్లీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార పరిధి, వాణిజ్యం వృద్ధిని నమోదు చేస్తుందని, కానీ పేపర్ కరెన్సీ క్రమంగా తగ్గుతుందని చెప్పారు. రీమానిటైజేషన్ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 30 తర్వాత కాగితపు కరెన్సీ తగ్గించనున్నట్టు ఆయన చెప్పారు. దీంతో ప్రజల షాపింగ్ తీరు మారిపోనుందని చెప్పారు. ఈ త్రైమాసిక అంతరాయాన్ని అంచనా వేయడం కష్టం, కానీ దీని ప్రభావం కొంత కాలమేనని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు. డీమానిటైజేషన్ ప్రభావంతో రబీ విత్తనాలు గత ఏడాది కంటే ఎక్కువగా లభ్యమవుతున్నారు. ఆటో అమ్మకాల్లో మిశ్రమ ధోరణి కనిపిస్తోందన్నారు. స్వల్పకాలంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాలు భారీగా ఉండనున్నట్టు జైట్లీ తెలిపారు. ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్తికవ్యవస్థగా భారత్ తన హవానుకొనసాగిస్తుందన్నారు. అధిక జీడీపీ, క్లీనర్ జీడీపీ సహేతుకమైన వడ్డీ రేట్ల సహకారంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందన్నారు. -
రియోలో స్వాగత సందడి
రియో డి జనీరో : బ్రెజిల్ సంస్కృతిని తెలిపే నృత్యాలతో బుధవారం క్రీడాగ్రామం సందడిగా మారింది. ఆటపాటలతో బ్రెజిల్ కళాకారులు ఒలింపియన్లకు ఘనస్వాగతం పలికారు. భార త బృందంతో పాటు బహమాస్, నార్వే, బర్కినా ఫసో, గాంబియా క్రీడాకారులు కూడా ఈ అధికారిక స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ ఈవెంట్లో భారత క్రీడాకారులు ఉల్లాసంగా గడిపారు. తొలుత జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో గిరిజన నృత్యాలు అలరించాయి. అనంతరం బ్రెజిలియన్ దిగ్గజ సంగీత దర్శకులు రౌల్ సేక్సస్, టిమ్ మైయా స్వరపరిచిన బాణీలతో పాటు లేటెస్ట్ హిట్‌సాంగ్స్, ఫర్, సాంబా నృత్యాలతో కళాకారులు భారత బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘం జత వెండి ఏనుగులు, బంగారు నెమలి ప్రతిమలతో క్రీడాగ్రామం మేయర్ జనేత్ ఆర్కేన్‌ను సత్కరించింది. అనంతరం ఒలింపిక్ క్రీడల ప్రాశస్త్యం గురించి జనేత్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి షూటర్లు జీతూరాయ్, ప్రకాశ్ నంజప్ప, గుర్ప్రీత్ సింగ్, చెయిన్ సింగ్, అథ్లెట్లు కుశ్బీర్ కౌర్, మన్‌ప్రీత్ కౌర్, మహిళల హాకీ జట్టు, స్విమ్మర్లు సాజన్, శివానితో పాటు పలువురు కోచ్‌లు, అధికారులు హాజరయ్యారు. ఈసారి భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 120 మంది క్రీడాకారులు రియోలో పోటీపడనున్నారు. ఇప్పటికే రియో చేరుకున్న భారత క్రీడాకారులకు బారా ఒలింపిక్ పార్క్‌కు సమీపంలో ఉన్న 31వ నంబరు భవంతిని కేటాయించారు. కుర్చీలు, టీవీలు కొనే పనిలో... భారత హాకీ జట్టుకు కావాల్సిన టీవీ సెట్లను, కుర్చీలను సమకూర్చడంలో గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ విఫలమైంది. అదనపు కుర్చీలు కావాలని కోరుతూ భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా చేసిన విజ్ఞప్తికి నిర్వాహకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో భారత ఎంబసీ ద్వారా రాకేశ్ టీవీలు, కుర్చీలు కొనుగోలు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇవి ఆటగాళ్లకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. -
ప్రత్యేక సేవలతో ఆకట్టుకున్న హైస్పీడ్ ట్రైన్!
హైస్పీడ్ ట్రైన్ ప్రారంభమైన తరుణంలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో కొత్తగా కనిపించిన దృశ్యం.. ప్రయాణీకులను అమితంగా ఆకట్టుకుంది. నీలం కోట్లు, బ్లాక్ ప్యాంట్లు ధరించి, ముఖంలో చిరు మందహాసంతో హోస్టెస్ లు మంగళవారం ఉదయం ప్రయాణీకులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం.. అత్యంత ఆసక్తికరంగా కనిపించింది. ఇప్పటివరకూ ఒక్క విమాన ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉన్న హోస్టెస్ సేవలు ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్.. గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో కూడ ప్రవేశ పెట్టడంతో రైల్వే స్టేషన్ లోని సన్నివేశం అందరినీ ఆకర్షించింది. లేడీజ్ అండ్ జెంటిల్మెన్.. అంటూ ప్రయాణీకులు రైల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను ప్రయాణీకులకు హోస్టెస్ లు వివరించడం విమాన ప్రయాణాన్ని తలపించింది. సీట్ బెల్టులు పెట్టుకోమని, ఆక్సిజన్ మాస్క్ లు ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుపుతూ వారిచ్చే సలహాలు, సూచనలపై ప్రయాణీకులు ఆసక్తిగా వినటం కొత్త గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో కనిపించింది. హోస్టెస్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు... ఎంతో ఛాలెంజింగ్ గా చేయాల్సిన పని. దేలో మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన అత్యంత వేగవంతమైన ట్రైన్ గతిమాన్ ఎక్స్ ప్రెస్. మొదటిరోజు ప్రయాణం ప్రారంభించగానే ఢిల్లీ ఆగ్రాల మధ్య అది అందుకున్న స్సీడ్ గంటకు సుమారు 160 కిలోమీటర్ల పైమాటే. అలా రైలు వేంగంగా ప్రయాణిస్తున్న సమయంలో హోస్టెస్ లు సీట్ల మధ్యనుంచి ఆహార పదార్థాలతో కూడిన ట్రేలు బ్యాలెన్స్ చేస్తూ, వేడి పానీయాల వంటివి ప్రాయాణీకుల మీద పడకుండా జాగ్రత్తగా సర్వ్ చేయాలి. అటువంటి పనిని సవాలుగా తీసుకొన్న హోస్టెస్ లు.... ఎంతో చాక చక్యంగా నిర్వహించారు. శాఖాహార, మాంసాహార భోజన వివరాలు, రైలు వివరాలను ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందిస్తూ... గతిమాన్ ఎక్స్ ప్రెస్ మొదటి ప్రయాణం ముగింపులో హోస్టెస్ లు ప్రయాణీకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణీకులు తమకు ఎంతో సహకరించారని, వారు చాలా ఆనందంగా ఉన్నారని, తమనిని సాదరంగా ఆహ్వానించి అభినందించారని గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో మొదటిరోజు విధులు నిర్వహించిన హోస్టెస్ మాయా తెలిపారు. అయితే ఇటువంటి సేవలు ప్రతి రైల్లోనూ అందించవచ్చుకదా అని అడిగిన ప్రశ్నకు ఆమె సానుకూలంగానే స్పందించినా... అన్ని రైళ్ళలో ఈ సేవలు మహిళలు అందించడం అంత సులభం కాదన్నారు. గతిమాన్ హైక్లాస్ ట్రైన్ కావడంతోపాటు... అందులో ఉన్న సౌకర్యాలు, సమయం అన్నివిధాల మహిళలకు సహకరించే విధంగా ఉంటుందన్నారు. ఈ ట్రైన్ లో ఆన్ బోర్డ్ సేవల ఏర్పాట్లను (క్యాటరింగ్ నుంచి హౌస్ కీపింగ్ వరకూ) ఐఆర్ సీటీసీ ద్వారా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపగా పట్టాలెక్కిన గతిమాన్ ఎక్స్ ప్రెస్.. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులకు ప్రత్యేక అనుభవాన్ని అందించింది. హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రావరకూ కేవలం 100 నిమిషాల్లో చేరుకొంది. విమాన సర్వీసుకు దీటుగా అన్ని ప్రత్యేక సదుపాయాలను అందుకున్న ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేశారు. -
పల్లకీ యాత్రకు ఘన స్వాగతం
- తుకారం మహరాజ్‌కు పుష్పవర్షం కురిపించిన భక్తులు - ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిన తెలుగు మాల సంఘం పింప్రి: జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ పల్లకీ యాత్రకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయం 11 గంటలకు దేహులో ఇనాందార్వాడ నుంచి పింప్రి, చించ్వడ్ వైపు సాగింది. అంతకు ముందు ఉదయం 4.30 గంటలకు హారతి, కీర్తనలతో మహాపూజ నిర్వహించారు. దారిపొడవునా భక్తులు పుష్పవర్షం కురిపించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనగడ్ షాహ బాబా దర్గాకు పల్లకీ చేరుకోగానే తరతరాల ఆచారం ప్రకారం అభంగ్, హారతి ఇచ్చారు. తర్వాత చింబోలి గ్రామంలోని పాదుకా మందిరానికి తుకారం వెండి పాదుకల పల్లకి చేరుకుంది. ఈ రాత్రికి ఆకృడిలోని విఠల్ రుక్మిణీ దేవాలయంలో విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయం యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. సాంప్రదాయిక ఆహ్వానం చింబోలి గ్రామంలో అత్యధికంగా నివసించే తెలుగు ప్రజలు సాంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసి పల్లకికి ఘన స్వాగతం పలికారు. దేహురోడ్డు, చించోలికి చెందిన తెలుగు మాల సమాజ్ ఆధ్వర్యంలో పళ్లు, ఫలహారాలను వార్కారీ (భక్తులు) లకు పంచారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వీటిని అందజేశారు. తెలుగు మాల సమాజ్ సంస్థ అధ్యక్షుడు శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు రాజు వెంకటేశ్, రాందాస్ దాసరి, ఈరేశ్ హాలహర్వి, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా వార్కారీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా వార్కారీలకు సేవ చేస్తున్నామని, భగవంతునికి సేవ చేసినట్లుగా తాము భావిస్తున్నామని సంఘం సభ్యులు చెప్పారు. -
ఆత్మీయ పలకరింపు
ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం తరలి వచ్చిన పార్టీ శ్రేణులు విమానాశ్రయం (గన్నవరం) : వైఎస్సార్సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నాయకులు వైఎస్. జగన్మోహన్రెడ్డికి గురువారం గన్నవరం విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలో రెండు రోజుల పాటు జరుగనున్న సమీక్ష సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానంలో ఉదయం 9 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయనకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు మహిళలు, యువకులు ఉత్సాహం చూపారు. విమానాశ్రయ ఆవరణలో పార్టీ శ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన అనంతరం ప్రత్యేక వాహనంలో గుంటూరు బయలుదేరివెళ్లారు. జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ఉప్పులేటి కల్పన, మేకా వెంకటప్రతాప్ఆప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జిల్లా పరిషత్ ప్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ విభాగం కన్వీనర్ ఎంవిఎస్. నాగిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, గుంటూరు నగర, జిల్లా కన్వీనర్లు లేళ్ళ అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, నియోజకవర్గ పార్టీ సమన్వకర్తలు వంగవీటి రాధాకృష్ణ, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పి. గౌతమ్‌రెడ్డి, మేరుగ నాగర్జున, అన్నభత్తుల శివకుమార్, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు దేవభక్తుని సుబ్బారావు, కోటగిరి గోపాల్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, డైమండ్ బాబు, ఎం. శేషగిరి, మేచినేని బాబు, నీలం ప్రవీణ్‌కుమార్, విజయవాడ నగర కార్పొరేటర్ అవుతు శైలజ, కాటంనేని పూర్ణచంద్రరావు, ఎండి. గౌసాని, లుక్కా ప్రసాద్ తదితరులున్నారు.