ఇంతవరకు మనం ఎన్నో వీడియోలను చూశాం. కానీ ఈ వీడియో మనకోక గొప్ప సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మనమంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. కొన్నిసారు పెద్ద పెద్ద నేతలు మనమందరం సమానం అంటూ పెద్దపెద్ద మాటాలు మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ నోటి మాటల వరకే పరిమితం. వాస్తవిక రూపంలో చాలా వేరుగా ప్రవర్తింస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వీడియో వాస్తవికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పేలా ఉంది.
ఇంతకీ ఆ వీడియయోలో ఏముందంటే....ముస్లీంలకు హజ్ యాత్ర అనేది అత్యంత పవిత్రమైనది. ప్రతి ముస్లీం జీవితంలో ఒక్కసారైన హజ్‌యాత్ర చేయాలనుకుంటాడు. ఐతే ఈ మేరకు సౌదీ అరేబియాలోని మక్కా(హజ్) యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముస్లీం సోదరులకు కాశ్మీరీ హిందువులు ఘనంగా స్వాగంత పలికారు. ఈ మేరకు కాశ్మీరీ పండిట్లు విమానాశ్రయం వెలుపలు ఉండి...స్వాగతం పలుకుతూ... ప్రవక్త మహ్మద్‌ను ప్రశంసిస్తూ కవిత్వం చెప్పారు.
వారు తీర్థయాత్రను విజయవంతం చేసుకుని తిరిగి వచ్చినందుకు గూలాబీ పూలు ఇస్తూ అభినందనలు చెప్పారు. అంతేకాదు వారికి హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇస్తూ.. ఆహ్వానం పలికారు కూడా. ఈ వీడియోని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారీ పోస్ట్ చేస్తూ...మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ సోదరుల ప్రేమ పై రాజీకీయాల చెడు దృష్టి పడుకుడదని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అన్సారీ సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్పీ) నేతగా ఉత్తరప్రదేశ్‌లోని మౌ సదర్ నియోజకవర్గానిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
हज करके लौटे हाजी लोग श्रीनगर एयरपोर्ट से निकले तो कश्मीरी पंडित भाईयों ने नात पढ़ते हुए आरती उतार कर उनका स्वागत किया और मुबारकबाद दी।
— Abbas Bin Mukhtar Ansari (@AbbasAnsari_) July 16, 2022
इस मुहब्बत को राजनीति की नज़र ना लगे। pic.twitter.com/Oo338QsrlV
(చదవండి: ఆ చిన్నారి చేసిన పని చూస్తే... నోట మాట రాదు!వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment