haz tour
-
ఏమతమైన అందరం ఒక్కటే!... అంటే ఇదేనేమో! వీడియో వైరల్
ఇంతవరకు మనం ఎన్నో వీడియోలను చూశాం. కానీ ఈ వీడియో మనకోక గొప్ప సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మనమంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. కొన్నిసారు పెద్ద పెద్ద నేతలు మనమందరం సమానం అంటూ పెద్దపెద్ద మాటాలు మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ నోటి మాటల వరకే పరిమితం. వాస్తవిక రూపంలో చాలా వేరుగా ప్రవర్తింస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వీడియో వాస్తవికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పేలా ఉంది. ఇంతకీ ఆ వీడియయోలో ఏముందంటే....ముస్లీంలకు హజ్ యాత్ర అనేది అత్యంత పవిత్రమైనది. ప్రతి ముస్లీం జీవితంలో ఒక్కసారైన హజ్‌యాత్ర చేయాలనుకుంటాడు. ఐతే ఈ మేరకు సౌదీ అరేబియాలోని మక్కా(హజ్) యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముస్లీం సోదరులకు కాశ్మీరీ హిందువులు ఘనంగా స్వాగంత పలికారు. ఈ మేరకు కాశ్మీరీ పండిట్లు విమానాశ్రయం వెలుపలు ఉండి...స్వాగతం పలుకుతూ... ప్రవక్త మహ్మద్‌ను ప్రశంసిస్తూ కవిత్వం చెప్పారు. వారు తీర్థయాత్రను విజయవంతం చేసుకుని తిరిగి వచ్చినందుకు గూలాబీ పూలు ఇస్తూ అభినందనలు చెప్పారు. అంతేకాదు వారికి హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇస్తూ.. ఆహ్వానం పలికారు కూడా. ఈ వీడియోని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారీ పోస్ట్ చేస్తూ...మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ సోదరుల ప్రేమ పై రాజీకీయాల చెడు దృష్టి పడుకుడదని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అన్సారీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నేతగా ఉత్తరప్రదేశ్‌లోని మౌ సదర్ నియోజకవర్గానిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. हज करके लौटे हाजी लोग श्रीनगर एयरपोर्ट से निकले तो कश्मीरी पंडित भाईयों ने नात पढ़ते हुए आरती उतार कर उनका स्वागत किया और मुबारकबाद दी। इस मुहब्बत को राजनीति की नज़र ना लगे। pic.twitter.com/Oo338QsrlV — Abbas Bin Mukhtar Ansari (@AbbasAnsari_) July 16, 2022 (చదవండి: ఆ చిన్నారి చేసిన పని చూస్తే... నోట మాట రాదు!వీడియో వైరల్) -
కేఎస్ఎస్ ట్రావెల్స్ ఘరానా మోసం
ప్రొద్దుటూరు క్రైం : ఉమ్రా (మక్కా) యాత్ర చేయాలనే కోరిక ప్రతి ముస్లింకు ఉంటుంది. అయితే ఖర్చుతో కూడుకుంది కావడంతో స్థోమత కలిగిన వారే ఉమ్రా, హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇటీవల ఒక ట్రావెల్ ఏజెంట్ రూ. 14 వేలకే ఉమ్రా యాత్ర చేయిస్తానని ప్రకటించడంతో ఎక్కువ మంది ముస్లింలు డబ్బు చెల్లించారు.ఇంత తక్కువ డబ్బుతో ఎలా ఉమ్రాకు తీసుకెళ్తారని చాలా మందిలో సందేహం రావడంతో వారిలో నమ్మకం కలిగించడానికి ఏజెంట్ ఒక బ్యాచ్‌ను తీసుకెళ్లాడు. చివరకు ఉమ్రా పేరుతో డబ్బువసూలు చేసుకొని పవిత్ర రంజాన్ మాసంలో అతను పాపానికి ఒడిగట్టాడు. నమ్మకం కలిగించి.. దోచుకొన్న ఏజెంట్ కడపకు చెందిన ఆలీ అనే వ్యక్తి ఒక పార్టీకి జిల్లా అ«ధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ అందరికీ సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలోనే అతను కేఎస్ఎస్ పేరుతో ట్రావెల్స్‌ను ఏర్పాటు చేశాడు. కడపలో హెడ్‌ఆఫీసును ఏర్పాటు చేసుకొని ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపురం, గుల్బర్గా తదితర ప్రాంతాల్లో ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను తెరిచాడు. ఒక్కో కార్యాలయంలో ముగ్గురు చొప్పున ఏజెంట్లను నియమించుకున్నాడు. అన్ని చోట్ల రూ. 14 వేలకే ఉమ్రాకు పంపిస్తామని ఫ్లైక్సీలను ఏర్పాటు చేశాడు. కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశాడు. ఉమ్రా యాత్రకు ట్రావెల్స్ నిర్వాహకులు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుంటారు. ఇంత తక్కువ డబ్బుతో ఎలా పంపిస్తారని అడిగిన వారితో అతను వాదిస్తూ వచ్చాడు. ‘ ఇందులో నేను ఒక్క రూపాయి కూడా లాభం తీసుకోను.. ఇంకా అంతో ఇంతో నాకే చేతి నుంచి పడుతుంది.. పేద, మధ్య తరగతి వారికి కూడా ఉమ్రా దర్శన భాగ్యం కల్పించాలన్నదే నా ఉద్దేశం’ అని చెబుతూ వచ్చాడు. ఇందులో భాగంగా అతను కొన్ని రోజుల క్రితం అన్ని ప్రాంతాల నుంచి కొంత మందిని ఎంపిక చేసుకొని ఉమ్రాకు పంపించాడు. వారు తిరిగి వచ్చిన తర్వాత నమ్మ కం కలగడంతో డబ్బు కట్టడానికి ట్రావెల్స్ వద్ద క్యూలో నిల్చున్నారు. డబ్బు కట్టడానికి వచ్చిన కొందరిని రెండు, మూడు రోజుల తర్వాత రమ్మ ని కూడా సిబ్బంది చెప్పేవారు. ఇలా ఒక్కో ప్రాం తం నుంచి రూ. కోట్లలో వసూలు చేసుకున్నాడు. డబ్బు కట్టిన కొందరికి ఉమ్రాకు వెళ్లే తేది కూడా చెప్పాడు. అయితే అతను చెప్పిన గడువు తీరడంతో చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. విమానాలు దొరకడం లేదని, నెల, రెండు నెలలు ఆలస్యం అయినా ఉమ్రాకు పంపిస్తానని నమ్మబలికే వాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో స్థానిక ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది. సుమారు 20 రోజులుగా ప్రధాన ఏజెంట్ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండటంతో కింది స్థాయి వారిలో కూడా ఆందోళన మొదలైంది. దీంతో ప్రొద్దుటూరు, కడపతో పాటు ఇతర ప్రాంతాల్లో ట్రావెల్స్ కార్యాలయాలను మూసి వేశారు. రూ, కోట్లలో వసూలు.. అతను ఉమ్రాకు పంపిస్తానని పేద, మధ్య తరగతి ప్రజల వద్ద నుంచి రూ. కోట్లలో డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ అవకాశం మళ్లీ రాదన్నట్లు ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే వారందరూ రూ.14 వేల చొప్పున డబ్బు చెల్లించిన వారు కూడా ప్రొద్దుటూరు, కర్నూలులో ఉన్నారు. ప్రొద్దుటూరులోనే సుమారు రూ. 6 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కడప, కర్నూలు, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, అనంతపురం తదితర ప్రాంతాల్లో కూడా రూ.కోట్లలో వసూలు చేసినట్లు సమాచారం. రోజు రోజుకు స్థానికంగా ఉన్న బ్రాంచ్ కార్యాలయాల ఏజెంట్లపై ఒత్తిడి అధికం కావడంతో వారు కూడా కార్యాలయాలకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేఎస్ఎస్ ట్రావెల్స్ ప్రధాన ఏజెంట్ ఆలీ బెంగళూరులో ఉన్నాడని తెలియడంతో ఏజెంట్లే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. రాయలసీమతో పాటు కర్నాటక, తమిళనాడు, తెలంగాణాలో కూడా అతను బ్రాంచ్ కార్యాలయాలను తెరచినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలోనే అతను అందరి వద్ద వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కడపలో ఆస్తులు కూడగట్టుకున్న ఏజెంట్ ఏజెంట్ ఇటీవల కడపలో పెద్ద ఎత్తున ఆస్తులను కొన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వివాదంలో ఉన్న పాఠశాలను రూ. 1.5 కోట్లు చెల్లించి అతను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పాఠశాలలో చేరాలని కడపలో ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కొన్నాడు. ఉన్నట్టుండి అతనికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే సందేహం అతని బంధువులు, సన్నిహితుల్లో కూడా నెలకొంది. -
జనవరి రెండోవారంలో హజ్ డ్రా!
న్యూఢిల్లీ: 2018లో హజ్ యాత్రకు వెళ్లే వారికోసం జనవరి రెండో వారంలో డ్రా నిర్వహిస్తామని హజ్ కమిటీ సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సారి వెయ్యిమందికి పైగా మహిళలు మెహ్రమ్(తండ్రి లేదా సోదరుడు లేదా కుమారుడు) తోడులేకుండా హజ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. హజ్‌యాత్ర దరఖాస్తు తుదిగడువును డిసెంబర్ 7 నుంచి 22కు పెంచినట్లు ఖాన్ పేర్కొన్నారు. మెహ్రమ్ లేకుండా 45 ఏళ్లు దాటిన మహిళల్ని నలుగురిని ఓ బృందంగా హజ్‌కు అనుమతించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
హజ్ సబ్సిడీ రద్దు!
ముంబై: హజ్ యాత్రికులకు సబ్సిడీ రద్దు, మగవారు తోడు లేకుండానే 45 ఏళ్లకు పైబడిన మహిళలు కనీసం నలుగురితో కలసి ప్రయాణించేందుకు అనుమతి...ఇవీ ప్రతిపాదిత హజ్ విధానంలోని కొన్ని ముఖ్యాంశాలు. 2018–22 కాలానికి ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా నేతృత్వంలోని కమిటీ రూపొందించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి శనివారం సంబంధిత నివేదికను సమర్పించారు. యాత్రికులు బయల్దేరే(విమానమెక్కే) ప్రదేశాలను ప్రస్తుతమున్న 21 నుంచి 9కి కుదించాలని, వారిని ఓడల ద్వారా పంపించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా అందులో ప్రతిపాదించారు. ‘2018 సంవత్సరానికి హజ్ యాత్రను నూతన విధానం ఆధారంగానే చేపడతాం. ఇది ఎంతో మెరుగ్గా ఉంది. ప్రజల భద్రత, పారదర్శకత పెంచేలా ఉంది’ అని నక్వీ అన్నారు. సబ్సిడీలో కోత విధించగా ఆదా అయిన నిధులను ముస్లింల సాధికారత, సంక్షేమానికి వినియోగిస్తామని మైనారిటీ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు 45 ఏళ్లకు పైబడిన మహిళలను మగ(మెహ్రాన్) తోడు లేకుండా అనుమతించేవారు కాదు. తండ్రి, సోదరుడు, కొడుకు(భర్త కాకుండా) లాంటి సంబంధీకులని మెహ్రాన్ అంటారు. 45 ఏళ్ల లోపు ఉన్న మహిళల వెంట మాత్రం మెహ్రాన్లు ఉండాల్సిందే. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తాజా విధానాన్ని రూపొందించారు. మరిన్ని ప్రతిపాదనలు: ► మెహ్రాన్ల కోటా 500కు పెంపు ► యాత్రికులు విమానమెక్కే స్థానాలను హైదరాబాద్, కొచ్చిన్, ఢిల్లీ, ముంబై, లక్నో, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులకు పరిమితం చేయాలి ► ఈ ప్రాంతాల్లో హజ్ హౌస్‌లను ఏర్పాటుచేసి, వాటిని అన్ని జిల్లాలతో అనుసంధానించాలి ► విమాన ప్రయాణంతో పోల్చితే చవకైన ఓడల ద్వారా యాత్రికులను పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ► హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల మధ్య 70:30 నిష్పత్తిలో కోటా పంపిణీని హేతుబద్ధీకరించాలి ► బిడ్డింగ్ ప్రక్రియలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడకుండా నిరోధించాలి. -
హజ్ యాత్ర పవిత్రమైనది..
ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా గుంటూరు (పట్నంబజారు): ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని, మక్కాను దర్శించడం వల్ల పవిత్రకరంగా ఉంటుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అన్నారు. హైదరాబాద్‌లోని హజ్ కమిటీ భవన్ వద్ద శనివారం హజ్ యాత్రికులు వెళుతున్న బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హజ్ కమిటీ భవనం నుంచి విమానాశ్రయానికి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి విమానంలో మక్కా చేరుకుంటారని తెలిపారు. గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు శనివారం పయనమవడంతో వారికి శుభాకాంక్షలు తెలిపి బస్సును ప్రారంభించారు. హజ్ యాత్ర 40 రోజులు ఉంటుందని, యాత్రలో ఎన్నో మసీదులు దర్శించుకుని ఆధ్యాత్మికతతో నడుచుకుంటూ భగవంతుని సేవలో నిమగ్నమవ్వాలన్నారు. పవిత్రకరమైన హజ్‌యాత్ర వల్ల జీవితంలో ఆధ్యాత్మికత పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగరానికి చెందిన ముస్లిం పెద్దలు అబిద్‌బాషా, కరీముల్లా ,మగ్బుల్బాబు తదితరులు పాల్గొన్నారు.