హజ్ యాత్ర పవిత్రమైనది..
హజ్ యాత్ర పవిత్రమైనది..
Published Sat, Aug 27 2016 9:14 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా
గుంటూరు (పట్నంబజారు): ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని, మక్కాను దర్శించడం వల్ల పవిత్రకరంగా ఉంటుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అన్నారు. హైదరాబాద్‌లోని హజ్ కమిటీ భవన్ వద్ద శనివారం హజ్ యాత్రికులు వెళుతున్న బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హజ్ కమిటీ భవనం నుంచి విమానాశ్రయానికి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి విమానంలో మక్కా చేరుకుంటారని తెలిపారు. గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు శనివారం పయనమవడంతో వారికి శుభాకాంక్షలు తెలిపి బస్సును ప్రారంభించారు. హజ్ యాత్ర 40 రోజులు ఉంటుందని, యాత్రలో ఎన్నో మసీదులు దర్శించుకుని ఆధ్యాత్మికతతో నడుచుకుంటూ భగవంతుని సేవలో నిమగ్నమవ్వాలన్నారు. పవిత్రకరమైన హజ్‌యాత్ర వల్ల జీవితంలో ఆధ్యాత్మికత పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగరానికి చెందిన ముస్లిం పెద్దలు అబిద్‌బాషా, కరీముల్లా ,మగ్బుల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement