జనవరి రెండోవారంలో హజ్‌ డ్రా! | Draw of lots for next year's Hajj in January 2nd week | Sakshi
Sakshi News home page

జనవరి రెండోవారంలో హజ్‌ డ్రా!

Published Mon, Dec 18 2017 3:10 AM | Last Updated on Mon, Dec 18 2017 3:10 AM

Draw of lots for next year's Hajj in January 2nd week - Sakshi

న్యూఢిల్లీ: 2018లో హజ్‌ యాత్రకు వెళ్లే వారికోసం జనవరి రెండో వారంలో డ్రా నిర్వహిస్తామని హజ్‌ కమిటీ సీఈవో మక్సూద్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. ఈ సారి వెయ్యిమందికి పైగా మహిళలు మెహ్రమ్‌(తండ్రి లేదా సోదరుడు లేదా కుమారుడు) తోడులేకుండా హజ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. హజ్‌యాత్ర దరఖాస్తు తుదిగడువును డిసెంబర్‌ 7 నుంచి 22కు పెంచినట్లు ఖాన్‌ పేర్కొన్నారు. మెహ్రమ్‌ లేకుండా 45 ఏళ్లు దాటిన మహిళల్ని నలుగురిని ఓ బృందంగా హజ్‌కు అనుమతించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement