రాప్తాడు నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రాష్ట్రంలో 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. గతంలో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలలను కలుపుతూ ఆరు మండలాలతో కొత్తగా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేశారు.
ప్రధాన సమస్యలు
నియోజకవర్గంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నా రు. సాగునీటి వనరులు లేకపోవడంతో రైతులు వర్షాధార పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ఇక్కడ సాగునీరే ప్రధాన సమస్య. దీనిని అధిగమించేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద సాగునీటి కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఆయన హయాంలో 70 శాతంపైగా పనులు పూర్తి చేశారు. ఆయన మరణం తర్వాత ఆ పనులు ముందుకు సాగడంలేదు. ఇక పీఏబీఆర్ ద్వారా నియోజకవర్గం గుండా వెళ్లే ధర్మవరం కాలువకు ఏటా సక్రమంగా నీటిని విడుదల చేయటం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు సాగునీటితోపాటు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం రాజకీయ పార్టీల పరిస్థితి
2009 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీడీపీ తరఫున పరిటాల సునీతా, పీఆర్‌పీ తరఫున కె క్రిష్టమూర్తి, బీజేపీ తరఫున వెన్నపూస రవీంద్రారెడ్డితోపాటు, మరో 16 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికలలో పరిటాల సునీత తన సమీప అభ్యర్థి తోపుదుర్తి ప్ర కాష్‌రెడ్డిపై 1950 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
పస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి టీడీపీ తరఫున పరిటాల సునీత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి , కాంగ్రెస్ తర ఫున రమణారెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పోటీ నామమాత్రమే అయినా టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య రసవత్తర పోరు తప్పదని రాజకీయ పరిశీలకులు భా విస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రశాంతత, అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన పరిటాల సునీతకు ఈ సారి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీకి ఓటు వేయొద్దు
గుత్తి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయాలేదని, అలాంటి వ్యక్తికి ఓటు వేసి మోసపోవద్దని ఏపి స్టేట్ విద్యుత్ సంస్థ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సయ్యద్ సాహెబ్ ముస్లిమ్‌లకు విజ్ఞప్తి చేశా రు. గురువారం ఆయన బీఎంఎస్ సోదరులు రఫీద్దిన్, నజీర్‌లతో కలిసి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో 15 శాతం జనాభా ఉన్నా కనీసం ఒక్క అసెంబ్లీ సీటును కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింకు కేటాయించలేదన్నారు. మతతత్వ మోడీతో జతకట్టి ముస్లింలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబును కలిసి రైతులు కష్టాల్లో ఉన్నారని ఉచిత విద్యుత్ ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరగా అమెరికాలో గాలిని కూడా అమ్ముతున్నారని విద్యుత్ ఎలా ఫ్రీగా ఇస్తామని తమపై మండి పడ్డారని సయ్యద్‌సాహెబ్ గుర్తుచేసుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఆయన తనయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ముస్లింలకు నాలుగు సీట్లు కేటాయించారన్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబుకు ముస్లింలు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు.
జగన్ సీఎం కాగానే వైఎస్‌ఆర్ పథకాలు అవులు
ఉరవకొండ రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధినేత జగ్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే వుహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవులు చేసిన సంక్షేవు పథకాలు తిరిగి కొ నసాగుతాయుని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు వై.వుధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకర్ల సవూవేశంలో మా ట్లాడారు. ఉరవకొండలో హంద్రీనీవా రెండవ దశ పనులు పూర్తి అవుతాయని, నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. జీడిపల్లి రిజర్వాయుర్ నుంచి అన్నీ చెరువులకు నీరు అందుతుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందన్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా విజయుం సాధిస్తావుని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రజలకు చేసింది శూన్యవుని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు సాధ్యం కాని హామీ ఇస్తూ ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. ప్రజలు టీడీపీకి గట్టి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
అనంత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ చౌదరి
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పీవీ అనిల్ చౌదరిని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గురువారం ప్రకటించారు. అనిల్‌కుమార్ చౌదరి అనంతపురం సహకార శాఖ పరిధిలోని సెంట్రల్ స్టోర్స్ అధ్యక్షుడిగా మూడు దఫాలుగా పనిచేశారు.
కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన ఈయన మాజీ మంత్రి పీవీ చౌదరి మనవడు. ఏడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్‌గా , సెంట్రల్ స్టోర్స్ అధ్యక్షునిగా, నూతిమడుగు పంచాయతీ అధ్యక్షునిగా పనిచేసిన పీవీరామ్మోహన్‌రెడ్డి కుమారుడు. చౌదరి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. వ్యూహాత్మకంగానే రఘువీరారెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అనిల్ చౌదరిని బరిలోకి దించినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
రసవత్తర పోరుకు రాప్తాడు సిద్ధం
Published Fri, Apr 18 2014 2:29 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement