సీపీఎం సీమాంధ్ర రెండో జాబితా విడుదల | CPM declares to release Seemandhra Assembly candidates 2nd list | Sakshi
Sakshi News home page

సీపీఎం సీమాంధ్ర రెండో జాబితా విడుదల

Published Wed, Apr 16 2014 2:53 AM | Last Updated on Sat, Mar 9 2019 3:30 PM

CPM declares to release Seemandhra Assembly candidates 2nd list

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో పోటీ చేసే మరికొందరు అభ్యర్థులతో సీపీఎం రెండో జాబితా విడుదల చేసింది. 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. అరకు లోక్‌సభ స్థానం నుంచి మిడియం బాబూరావు, విశాఖ నుంచి సీహెచ్ నర్సింగరావు, విజయవాడ నుంచి వి. ఉమామహేశ్వరరావు, తిరుపతి నుంచి కొత్తపల్లి సుబ్రమణ్యం పోటీ చేస్తారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కోలక లక్ష్మణమూర్తి (కురుపాం), పాలిక లక్కు (పాడేరు), కాట్రగడ్డ స్వరూపరాణి (గన్నవరం), ఆవుల బసవయ్య (అవనిగడ్డ), ఎం.ఆశీర్వాదం (కొడుమూరు), మాదాల వెంకటేశ్వర్లు (నెల్లూరు) ఉన్నారు. సీపీఎం తొలి జాబితాలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితా విడుదలతో 44 అసెంబ్లీ, 4 లోక్‌సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement