షోలాపూర్ సెంట్రల్ సిటీ ఎన్నిక రద్దుచేయాలి | Narasayya Adam demand the cancellation of elections in solapur central city | Sakshi
Sakshi News home page

షోలాపూర్ సెంట్రల్ సిటీ ఎన్నిక రద్దుచేయాలి

Published Wed, Oct 22 2014 11:52 PM | Last Updated on Mon, Oct 22 2018 8:37 PM

Narasayya Adam demand the cancellation of elections in solapur central city

సీపీఎం నేత ఆడం డిమాండ్
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ సెంట్రల్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక రద్దు చేయాలని సీపీఎం అభ్యర్థి, మాజీ శాసన సభ్యుడు నర్సయ్య ఆడం డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నిక రద్దుచేయాలని కోరుతూ తాను త్వరలోనే ముంబై హైకోర్టులో వాజ్యం దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ సిటీ స్థానం పరిధిలో తను శివసేనకు మద్దతు ప్రకటించినట్లు ఓటర్లను నమ్మించి దుష్ర్పచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వాట్సప్‌లో పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆరోపించారు. హిందువుల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పాల్పడ్డారని తెలిపారు.

కాగ్రెస్ పార్టీ నుంచి తను రూ.11 కోట్లు తీసుకుని ప్రణతి షిండేకు మద్దతు ఇచ్చినట్లుగా ఎంఐఎం వారు తనపై దుష్ర్పచారం చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు తాను ఎన్నికల అధికారి శాహుజీ పవార్, పోలీసు కమిషనర్‌లకు 13వ తేదీన అందజేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్లలో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసి ఓట్లు పొందిందని ఆయన ఆరోపించారు.తన ఫిర్యాదులపై అధికారులెవరూ స్పందించనందున కోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో అడ్వకేట్ ఎం.హెచ్.శేఖ్, నసియా శేఖ్, సిద్దప్ప కలుశెట్టి, సురేష్ పలుమారి, అశోక్ బల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement