సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మలివిడత ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ ఖరారైంది. తొలి విడతలో అక్టోబర్ 15 నుంచి ఈనెల 3 వరకు 30 నియోజకవర్గాల్లో ఇప్పటికే సభలను నిర్వహించారు. 5వ తేదీ నుంచి 8 వరకు మరో 11 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
ఇవి పూర్తికాగానే 5 రోజుల విశ్రాంతి అనంతరం 13 నుంచి 28వ తేదీ వరకు 16 రోజుల పాటు నిర్విరామంగా సీఎం పర్యటన కొనసాగేలా మలి విడత షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో సీఎం పాల్గొంటారు.
ఈనెల 25న హైదరాబాద్‌లో భారీ సభను నిర్వహించనున్నారు. రెండో విడత పర్యటనలో ఒక్కో రోజు 3–4 నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన 28న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ పర్యటన ముగియనుంది. దీంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తయ్యేలా షెడ్యూల్‌ను పార్టీ రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment