
'తిరుపతి నియోజక వర్గంలో మళ్లీ ఉప ఎన్నిక జరిపించాలి'
హైదరాబాద్: తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అధికారులే ఓటర్ స్లిప్పులు పంచి ప్రజల చేత దొంగ ఓట్లు వేయించి రిగ్గింగ్ కు సహకరించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరారు.