Boath Assembly Constituency
-
సీఎం హామీల జల్లు!
ఆదిలాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్‌ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్‌తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది. రెండు గంటలు ఆలస్యంగా... ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ æరాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురి చేరిక.. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు.. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. ఇవి చదవండి: ఒక్క రుణమాఫీపైనే ఒట్టా.. : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి -
బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్యే!
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు పార్టీల్లో సీనియర్ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పరిస్థితి బట్టి అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో కీలక నేత బీఆర్ఎస్ను వీడుతున్నట్టు వెల్లడించారు. ఆయన హస్తం గూటిలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టికెట్ ఇవ్వకపోవడంపై గుస్సా.. వివరాల ప్రకారం.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో బాపూరావు సమాలోచనలు, చర్చలు జరిపారు. తాను ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాను ఏ పార్టీలో చేరుతున్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే, బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్ నో అపాంట్మెంట్.. మరోవైపు.. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక, బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్‌లకు టికెట్ లభించకపోవడంతో వారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం -
బీఆర్ఎస్ కంచుకోట బోథ్‌లో ఉత్కంఠ!
ఒకప్పుడు మావోయిస్టు కోట ఉన్న బోథ్ ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. కానీ ఎమ్మెల్యే తీరుతో బీఅర్ఎస్ కోట బద్దలవుతోంది. ఎమ్మెల్యేపై సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. ఇక అధిష్టానం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండ కొత్త అభ్యర్థి పేరు ప్రకటించింది. ఈసారి టికెట్‌ను అనిల్ జాదవ్‌కు కట్టబెట్టింది. దాంతో బోథ్ ఎన్నికలు వెడేక్కాయి. ఇక ముందు నుంచే అధిష్టానం అభ్యర్థి మార్పుపై సంకేతాలు ఇస్తూ రావడంతో బీఆర్ఎస్లో ఆశావాహులు సంఖ్య పెరిగిందట. టికెట్ అనిల్ జాదవ్‌కు ప్రకటించడంతో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంపి సోయం బాపురావు ఏ పార్టీ రంగంలో దిగుతారు? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుండి పోటి చేయడ ఖాయమైందా? లేదంటే కమలం నుండి పోటీ చేస్తారా? భోథ్‌లో ఎన్నికల వార్‌పై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో సుందరమైన జలపాతాలు ఉన్నా ప్రాంతం. ప్రధానంగా కుంటాల, పోచ్చేర, గాయత్రి, కనకాయి జలపాతాలు ఉన్న అద్భుతమైన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, భీమ్‌పూర్, తలమడుగు, బజరాత్నూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,0,1034 ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో గోండులు అత్యదికంగా ఉన్నారు. వీరే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలల్లో ప్రజల్లో దూసుకపోతుంది గులాబీ పార్టీ. కానీ, ఈ నియోజకవర్గంలోఎమ్మెల్యే వ్యవహర శైలి పార్టీ తలనోప్పిగా మారింది. అవినీతి అరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కేట్ ఇస్తే ఓటమి ఖాయమట. అలాంటి వారికి టిక్కెట్ ఇస్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేలలో తెలిందట. అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేయాలని ఉత్సహం చూపిస్తున్నారు. కానీ పార్టీ నిర్వహించిన సర్వేలలో ప్రజల్లో వ్యతిరేకత అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే నట. దీనికి తోడు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు మచ్చగా మారిందట. ప్రజలతో అనుబంధం లేదట. పార్టీనాయకులతో సఖ్యత లేదట. అభివృద్ధి పనుల నుండి సర్కార్ సంక్షేమ. పథకాలలో అడ్డగోలుగా అవినీతికి పాల్పపడ్డారని ఎమ్మెల్యేపై అరోపణలు ఉన్నాయట. దళితబంధులో ఎమ్మెల్యే అనుచరులు లూటీ దందా సాగించారని ప్రచారం ఉంది. అదేవిధంగా జలపాతాలు ఉన్నా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయలేదు. సాగునీరు అందించడానికి కుప్టి నిర్మించలేదు. నియోజకవర్గంలో డిగ్రీ కళశాల లేదు. ఎళ్లుగా కళశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రేవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక అనేక మారుమూల గూడాలకు రవాణా సౌకర్యం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయలేదు. పైగా ఈ అవినీతి ఆరోపణలే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు టిక్కెట్ ఎసరు తెచ్చిందని అంటున్నారు. ఓడిపోయే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వలేమని సీఎం కేసీఅర్ బాపురావుకు తేగేసి చెప్పారట. గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తరపున ఎంపీ సోయం బాపురావు పోటీ చేసి విజయం సాదించారు. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీకి సిద్దమవుతున్నారు. అయితే సోయం బీజేపీ నుండి పోటీ చేస్తారా? లేదంటే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. అదివాసీల మద్దతున్నా సోయం బాపురావు బలమైన అభ్యర్థి. మాజీ ఎంపి నగేష్పే గతంలో ఓడించారు సోయం.. కానీ మాజీ ఎంపి నగేష్ మళ్లీ ఎంపిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్ కూడా దేశంలో పట్టుసాదించాలని భావిస్తున్నారు. దేశంలో బీఅర్ఎస్ కీలకపాత్ర పోషించాలంటే ఎంపీ సీట్లు కీలకం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగేష్‌ను ఎంపిగా పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతుందట.