మాట్లాడుతున్న మాజీ ఎంపీ హన్మంతరావు
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే కులాలవారీగా జనగణన చేపడుతామని, ఇందుకు ఏఐసీసీ అధినాయకత్వం కూడా హామీ ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మతంరావు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ.. కేంద్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
బీసీల అభ్యున్నతిని పట్టించుకోకపోవడమే కాకుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలను నిర్లక్ష్యం చేస్తూ సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడమే తెలంగాణ ప్రభుత్వ ధరణి పోర్టల్ ఉద్దేశమన్నారు.
మంగళవారం కరీంనగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా బీసీ సదస్సుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గైర్హాజరవడం సరికాదని పేర్కొన్నారు. పార్టీలో సమస్యలను హైకమాండ్ పరిష్కరిస్తుందని తెలిపారు.
తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులకు హైకమాండ్ చోటు కల్పించిందనన్నారు. ఈ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న ప్రభాకర్ సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికై న పొన్నం తిరిగి పార్టీ కోసం పని చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి అంజన్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment