యుద్ధాన్ని తలపించేలా ఆదిలాబాద్‌ ఎన్నికలు | Adilabad: Who Will Next Incumbent In Adilabad Constituency | Sakshi
Sakshi News home page

యుద్ధాన్ని తలపించేలా ఆదిలాబాద్‌ ఎన్నికలు

Published Thu, Aug 24 2023 1:42 PM | Last Updated on Tue, Aug 29 2023 11:17 AM

Adilabad: Who Will Next Incumbent in Adilabad Constituency - Sakshi

ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఈసారి జరగబోయే ఎన్నిక యుద్దాన్ని తలపిస్తోంది. ఇక్కడ పాగా వేసేందుకు కారు పార్టీ, కమలం, కాంగ్రెస్ కత్తులు దూసుకుంటున్నాయి. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించడానికి  ఎత్తుకు  పై ఎత్తులు వేస్తున్నాయి. ఐదోసారి ఎమ్మెల్యేగా జోగు రామన్న విజయం సాధించకుండా పావులు కదుపుతున్నారు. ఆదిలాబాద్ ఎన్నికల యుద్ధంలో గెలిచే  బాద్ షా ఎవరు. తెల్ల బంగారం కోటలో ఎన్నికల విజయభేరి మోగించేది ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. 

ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఓ వైపు   అపారమైన మాంగనీస్ సిరులు, మరోవైపు సిమెంట్  నిల్వలున్నాయి.  ఇంకోవైపు తెల్ల బంగారం పంటకు ఆసియాలోనే ప్రసిద్ది చెందింది. నియోజకవర్గంలో ఆదిలాబాద్, జైనథ్, బేల, మావల. ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్  రూరల్ మండలాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం  రెండు లక్షల ఇరవై ఐదు వేల ముప్పై నాలుగు ఓటర్లు ఉన్నారు.. వీరిలో  ప్రధానంగా మున్నూరు, ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారే ఈ అభ్యర్థుల రాతను మార్చనున్నారు.

మంత్రి పదవిపై రామన్న కన్ను!
ప్రస్తుతం ఎమ్మెల్యేగా జోగురామన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీపాయిగూడ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సర్పంచ్‌గాగా జైనథ్ ఎంపిపిగా, జడ్పీటీసీగా, ఆదిలాబాద్  నియోజకవర్గం నుండినాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై   ఎమ్మెల్యే జోగురామన్న  రికార్టును సృష్టించారు. 2009, 2012, 2014, 2018 ఎన్నికలలో విజయం  సాధించారు.. ప్రధానంగా 2014ఎన్నికలలో 14,711 ఓట్ల మెజారీటీతో, 2018లో 26,606 ఓట్ల మెజారిటీతో జోగురామన్న బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై విజయం సాదించారు. మళ్లీ అదేవిధంగా 5వ సారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని గ్రామాలను చుట్టేస్తున్నారు ఎమ్మెల్యే రామన్న. బీఆర్‌ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే... మొదటి సారి సీఏం కేసీఆర్ ప్రభుత్వంలో రామన్న మంత్రిగా పనిచేశారు.

రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. రెండోసారి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కానీ ముచ్చటగా మూడోసారి ఎర్పడబోయే ప్రభుత్వంలో మంత్రి కావాలని కలలుకంటున్నారు. అందులో భాగంగా ఈసారి 2023లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజిక ఓటర్లు మెజారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. అదే సామాజిక వర్గానికి చెందిన రామన్నకు సోంత సామాజికవర్గం అండగా నిలుస్తున్నారు. గంపగుత్తగా ఓట్లు వేస్తున్నారు. దాంతో విజయ యాత్రను  కొనసాగిస్తున్నారు. మున్నూర్ కాపు ఓట్ల తర్వాత. ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు రాబోయే ఎన్నో తనకు  దన్నుగా నిలుస్తాయాని రామన్న అంచనాలు వేసుకుంటున్నారట.

దీనికి తోడు సర్కారు నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలతో  నియోజకవర్గం రూపురేఖలు  మార్చారు రామన్న. ఆదిలాబాద్ పట్టణం సుందరీకరణ, అదివాసీ గూడాల రోడ్ల సౌకర్యం కల్పించారు. అదే విధంగా చెనాక, కోరాట బ్యారేజి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రేపు మాపో రైతులకు అందించే అవకాశం ఉంది. వీటితో మైనారీటీ, బీసీ,  ఎస్టీ  డిగ్రీ కళశాలలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ఆర్వోబీకి నిధులు మంజూరు చేయించారు. పనులు కూడ సాగతున్నాయి. ఇలాంటి పథకాలతో ఐదోసారి గెలుపును ఎవరు అపలేరని భావిస్తున్నారట రామన్న.

రామన్నపై జైనథ్, బేల మండలాల ప్రభావం!
నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి  పథకాలు పూర్తి కాలేదు. చెనాక కోరాట పనులు చివరి దశకు చెరుకున్నాయి.  ఎత్తి పోతల పథకంకు నీరు అందించాలంటే ప్రధాన కాల్వ పూర్తయినా... డిస్ట్రిబ్యూషన్ కాల్వలు పూర్తి  కాలేదు. దాంతో ఎప్పుడు నీరు అందిస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా  ఇటీవల  తర్నామ్  అంతరాష్ట్ర రహదారిపై బ్రిడ్జి బీటలు వారింది. ప్రమాదకరమైన స్థితికి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. రవాణ సౌకర్యాలు నిలిపి వేయడంతో  జైనథ్, బేల మండలాల ప్రజలు  తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం నిదులు మంజూరు చేయించారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. ఇది రామన్నకు ఇబ్బందిగా మారింది.

అదేవిధంగా బీఅర్ఎస్ నాయకులు కబ్జాలు చేయడం రామన్నకు చెడ్డపెరు తెచ్చిందట. రామన్నపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందనే  ప్రచారం ఉంది. రిమ్స్ సూపర్ స్పేషాలీటీ డాక్టర్ నియమాకాలు చేయలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సిమెంట్ పరిశ్రమ ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే  పరిశ్రమ మూతపడి ఏళ్లు అయ్యింది. ఈ పరిశ్రమను తెరిపిస్తామని రామన్న ఎన్నికల హమీ ఇచ్చారు. అయితే పరిశ్రమను పున: ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాయితీలు ఇస్తామని అప్పటి పరిశ్రమల మంత్రికి  లేఖలు  అందించారు.

కానీ ప్రారంభించడానికి కేంద్రం సిద్దంగా లేదు. రాష్ట్ర జనన ప్రభుత్వం పరిశ్రమ పున:ప్రారంభానికి రాయితీలు ఇస్తామని ప్రకటించినా లేఖలు రాసిన కేంద్రం పట్టించుకోవడం లేదట. ఈ పరిశ్రమను పున:ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకరావడానికి రామన్న అధ్వర్యంలో ఉద్యమం నిర్వహించారు. అందులో బాగంగా ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారులు దిగ్భందం చేశారు. కేంద్రం స్పందించ లేదు. అదేవిధంగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అడుగు కదలడం లేదు. నిర్మాణం కోసం భూములు  ఉన్నా కేంద్రమే పట్టించుకోవడం లేదని రామన్న బీజేపీ నాయకులపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు.

కారుపై కమలం ఎత్తుగడలు:
నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాదించిన రామన్న కోటను బద్దలు చేయాలని కమలం పార్టీ ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే  రామన్నపై బిజెపి అభ్యర్థిగా పాయల్  శంకర్  మూడు సార్లు  ఓటమి  పాలయ్యారు. ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని  పాయల్ భావిస్తున్నారు. కాని పాయల్  శంకర్‌కు టిక్కెట్ ఇవ్వోద్దని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వాలని పార్టీని పట్టుబడుతున్నారట. ఈ ఇద్దరు బీజేపీ నాయకులు టిక్కెట్ కోసం పోరు సమరాన్ని మరిపిస్తోంది. ప్రత్యర్థి  నాయకుల్లా అదిపత్య దండయాత్రలు  ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారట. సుహసిని రెడ్డి కాలనీలలో పర్యటనలు చేస్తే.  పాయల్   శంకర్ సర్కార్ వైఫల్యాలపై పోరాటం సాగిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు.

దాంతో  నియోజకవర్గంలో  పార్టీ రెండు  ముక్కలుగా చీలింది. మెజారిటీ పార్టీ నాయకులు పాయల్  వైపు  ఉంటే. మరికొంత మంది సుహసిని వైపు ఉన్నారు. వీరిద్దరు రామన్నపై పోరాటం కంటే ఒకరిపై ఒకరు యుద్దానికి ప్రాథాన్యత ఇస్తున్నారట. పార్టీ   జాతీయ,  రాష్ట్ర నాయకత్వాలు సర్కార్ వైఫల్యాలపై పోరాటానికి పిలుపునిస్తే కలిసి పనిచేయడం లేదు. ఇద్దరు తలోదారిలో వెళ్లుతున్నారు. పార్టీని, కార్యకర్తలను  అయోమంలో  గురి చేస్తున్నారట. పైగా పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థులను  ప్రకటించకున్నా   ఎన్నికల ప్రచారం మొదలు  పెట్టారట.  ఒకరిని  మించి  మరోకరు ప్రజల వద్దకి ప్రచారం చేస్తున్నారట. పార్టీ క్యాడర్ మేజారీటీ పాయల్ శంకర్‌ ఓట్లు జనన ఉందట. క్యాడర్ తోపాటు బీసీ కమీషన్ జాతీయ చైర్మన్ హన్స్‌రాజ్‌ గంగరాం, బీబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతుతో పార్టీ  టిక్కెట్ మళ్లీ తనకే దక్కుతుందని భావిస్తున్నారట పాయల్‌. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మద్దతు సుహసినరెడ్డికి ఉందట. కిషన్‌రెడ్డి మద్దతుతో మాజీ జిల్లా పరిషత్‌ సుహసిరెడ్డి టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్నారట. బిజెపీ వర్గపోరు ఎన్నికలలో ఎమ్మెల్యే రామన్నకు అనుకూలుంగా మారుతుందని ప్రచారం ఉంది.

కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితి!
ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా ఉంది. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత 19శాతంతో 32 వేలకు పైగా ఓట్లు సాదించారు. ఆ తర్వాత పార్టీ  పరిస్థితి దిగజారుతోంది. బలమైనా నాయకత్వం లేక పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. వచ్చే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గండ్ర సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఎన్ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. కానీ సుజాత, సంజీవ్రెడ్డి, సాజిద్‌ఖాన్‌ త్రయం.. కంది శ్రీనివాస్రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. పారాచ్యూట్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వవద్దని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.  టిక్కెట్  ఇచ్చిన కలిసి పని చేయంటున్నారు. కానీ ఏల్లిగాడు, మల్లిగాని గ్రూపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

కౌన్సిలర్గా గెలువలేని నాయకులతో అయ్యేది లేదు, పోయేది లేదని కోట్టిపారేస్తున్నారట కంది. ఇక తానే అభ్యర్థి అని కంది ప్రచారం చేసుకుంటున్నారట.ప్రజల్లోకి వెళ్లుతున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ వర్గాల కుంపట్లు రామన్నకు అనుకూలంగా మారుతుందని ప్రచారం ఉంది. బీజేపీలో పాయల్కు  టిక్కెట్ దక్కితే సుహసిని  పనిచేయరట. అదేవిధంగా  సుహసినికి  టిక్కెట్ దక్కితే  పాయల్ పార్టీ కోసం పని చేయరని ప్రచారం ఉంది. మరి  కలహల కుంపట్లను దాటి రామన్నను చిత్తు చేస్తానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయట. రామన్న మాత్రం ఆరు నూరైనా విజయం తనదేనని విస్తున్నారట.. మరి   ఆదిలాబాద్  గడ్డపై   ఏవరు పాగా వేస్తారో  చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement