నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేములవాడ 2009లో ఏర్పడింది. 2009లో మహాకూటమిలో భాగంగా వేములవాడ నుండి టిడిపి పార్టీ నుండి చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్‌పై 1821 ఓట్లతో గెలుపొందారు. 2009 సంవత్సరంలో తెలంగాణ ఇచ్చినట్లుగానే ఇచ్చి వెనక్కి తీసుకున్న నెపంతో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన రమేశ్ బాబు టీ(బీ)ఆర్ఎస్ పార్టీ నుండి 2010లో ఉప ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై గెలిచారు...
.. 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేయగా బిజెపి నుండి బరిలో ఉన్న ఆది శ్రీనివాస పై 5 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందారు. వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొమ్మ వెంకటేశ్వర్లు 14 వేల వరకు ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 28 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వేములవాడ నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి టిఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే ఉంది. ఇప్పటివరకు ప్రధాన ప్రత్యర్థిగా ఆది శ్రీనివాస్ మాత్రమే ఉన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ దేని నుండి పోటీ చేసిన ప్రత్యర్థిగా కనిపిస్తున్నాడు అది. చెన్నమనేని రమేశ్ బాబు తండ్రి రాజేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిజెపికి దాదాపు 20 వేల పైగా ఈ నియోజకవర్గం నుండి వచ్చింది. వేములవాడ నియోజకవర్గంలో ముఖ్యంగా కోనరావుపేట మండలం ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది. బిజెపి నాయకుడు చిన్నమనేని విద్యాసాగర్ రావు అలాగే లక్ష్మి నరసింహ రావు రమేష్ బాబు మండలం కోనరావుపేట కావడంతో ఆసక్తి నెలకొంది. అత్యంత ప్రభావితం చేసే గ్రామంగా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామం ఉంది.
కనీసం అత్తగారి గ్రామాన్ని కూడా పట్టించుకోని కేసీఆర్:
ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. దాంతోపాటు మండలంలో ప్రధానంగా ఎనిమిది ముంపు గ్రామాలు ఉండగా..వాటికి ఇవ్వవలసిన ఆర్.ఆర్. ప్యాకేజీ ఇవ్వకపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారు గ్రామమైన కొదురుపాక గ్రామాన్ని కూడా పట్టించుకోలేదనే వాదన ఉంది. ఈ గ్రామం కూడా ముంపు గ్రామాల్లో ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంతేకాదు ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం BRS పార్టీకి మైనస్‌గా అనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుండి గతం నుండి పోటీ చేసిన ఆది శ్రీనివాస్ ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తోనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రాజన్న అభివృద్ధి ఏది?
వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అలాగే చెలిమెడ లక్ష్మీనరసింహారావు మనోహర్ రెడ్డి ఎన్నారై గోలి మోహన్ టికెట్ ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ అభివృద్ధి చేయకపోవడం బి ఆర్ ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పుకోవచ్చు, అలాగే కేటీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటున్న గోలి మోహన్ టికెట్ ఆశిస్తుండగా సీనియర్ నేతగా మనోహర్ రెడ్డి టికెట్ రేసు లో ఉన్నాడు, ఒకవేళ టిఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని అభ్యర్థి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
బిజెపి పార్టీలో త్రిముఖ పోటీ?
బిజెపి పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారిలో భాజాప సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు అలాగే ప్రతాపరామకృష్ణుడు సీనియర్ నేత తుల ఉమా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ రావుకు టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి చేయని అభివృద్ధిని క్యాష్ చేసుకొని ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో నిలిచి గెలుపు బాటలో ఉండాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలం ఆది శ్రీనివాస మాత్రమే బరిలో ఉంటున్నాడు. రెబల్ బెడద్ కూడా లేకపోవడంతో, కాంగ్రెస్ టికెట్ ఆది శ్రీనివాసకి కన్‌ఫాం చేస్తున్నట్టు చెబుతున్నారు.
భౌగోళిక పరిస్థితులు:
వేములావాడ నియోజకవర్గం లో ప్రధాన ఆలయం రాజన్న ఆలయంగా చెప్పవచ్చు,నాంపల్లి పర్యాటక కేంద్రంగా ఉంది గతంలో బీజేపి ఎంపీ గా ఉన్నప్పుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు నాంపల్లిని పర్యాటక కేంద్రంగా చేసారు.
అధికార పార్టీపై ‘రాజన్న’ ప్రభావం
ముఖ్యంగా రాజన్న ఆలయానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ 100 కోట్లు అభివృద్ధికి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, గ్రామాల ప్రజలను పట్టించుకోకపోవడం వారికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment