ధర్మపురి (ఎస్సి) నియోజకవర్గం
టిఆర్‌ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ దర్మపురి రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. ఆయన టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి గెలుస్తున్నారు.రెండు ఉప ఎన్నికలతో సహా మొత్తం ఆరుసార్లు గెలిచారు. 2014లోనే ఆయన మంత్రి అవుతారని అనుకున్నారుకాని ఛీప్ విప్ పదవిని మాత్రమే పొందగలిగారు. 2018లో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. కాగా 2018లో అత్యంత తీవ్రమైన పోటీని ఆయన ఎదుర్కున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎ.లక్ష్మణకుమార్‌ను కేవలం 441 ఓట్ల తేడాతో ఈశ్వర్ ఓడిరచారు. ఈయనకు 70579 ఓట్లు రాగా, లక్ష్మణ్ కుమార్‌కు 70138 ఓట్లు వచ్చాయి. కాగా స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన కె.నరసయ్యకు 13వేల కు పైగా ఓట్లు రావడం విశేషం.
2004లో, ఆ తర్వాత ఒక ఉప ఎన్నికలో మేడారం నుంచి గెలిచిన ఈశ్వర్, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దర్మపురి నుంచి 2009 సాధారణ ఎన్నికలోను,ఉప ఎన్నికలోను గెలుపొంది, ఆరేళ్లలో నాలుగుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలుపొందారు. 2014, 2018తో సహా మొత్తం ఆరుసార్లు గెలిచారు. ఆరేళ్ళ వ్యవధిలో నాలుగుసార్లు గెలిచిన ముగ్గురు టిఆర్‌ఎస్ నేతల్లో ఈశ్వర్ ఒకరు కావడం విశేషం. టి. హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లు కూడా ఇదే విధంగా గెలిచారు.
ధర్మపురి (ఎస్సి)లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment