
సాక్షి, జగిత్యాల జిల్లా: మోదీ వాట్సాప్ వర్సిటీలో అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు పీఎంగా ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ధర్మపురి జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణా విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు.. కానీ గుజరాత్ అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగలేదన్నారు.
బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతోంది రిజర్వేషన్ల రద్దు కోసమే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. 50 శాతం రాష్ట్రాల మద్దతు కూడా కావాలి కాబట్టే రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చి బీజేపీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తోంది.. రాజకీయ అవకాశాలు ఎస్సీ, ఎస్టీలకి మరింత ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది.. అందుకే కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు మద్దతు తెలిపినట్టే’’ అని సీఎం రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment