సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్‌లో భిన్న నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన అని కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరిక అవసరం లేదు
పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..@jeevanreddyMLC @PocharamBRS @PocharamBRS @PocharamBhasker @BRSparty @INCTelangana @KTRBRS pic.twitter.com/w7wYzgz0gz— Sai (@Vardhavelly) June 23, 2024
అయితే, జీవన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆదివారం సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ సెంటర్స్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment