Who Is The Next Leader Of Sircilla Constituency, Know Its Political History In Telugu - Sakshi
Sakshi News home page

సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆధిపత్యం ఎవరిది?

Published Mon, Jul 31 2023 10:15 AM | Last Updated on Thu, Aug 17 2023 12:47 PM

Who Is The Next Leader In Sirisilla Constituency - Sakshi

సిరిసిల్ల నియోజకవర్గం

సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుమారుడు, మంత్రిగా ఉన్న కెటిఆర్‌ నాలుగోసారి ఘన విజయం సాదించారు. ఆయన భారీగా తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి మహేందర్‌ రెడ్డిపై  89,009 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కెటిఆర్‌ ఎన్నికల తర్వాత మంత్రి పదవిని పొందలేదు. అయితే టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అద్యక్షుడుగా నియమితులవడం విశేషం. ఆ తర్వాత కొద్దికాలానికి కెసిఆర్‌ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. తండ్రి కెసిఆర్‌ ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించగా, కెటిఆర్‌ నాలుగుసార్లు ఇంతవరకు ఎన్నికయ్యారు.

వీరిద్దరూ కలిసి పన్నెండుసార్లు గెలిచారన్నమాట. కెటిఆర్‌కు 125213 ఓట్లు పొందగా, మహేందర్‌ రెడ్డికి కేవలం 36204 ఓట్లు మాత్రమే పొందారు. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర్సాగౌడ్‌కు కేవలం మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. కెటిఆర్‌ వెలమ సామాజికవర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యదిక సార్లు ఇదే సామాజికవర్గం నేతలు గెలుపొందారు. ఏపీ, తెలంగాణలలో ఒక ముఖ్యమంత్రి కుమారుడు అదే క్యాబినెట్‌లో ఉండడం కెటిఆర్‌తోనే ఆరంభం అయిందని చెప్పాలి. తారక రామారావు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తండ్రి తెలంగాణ ఉద్యమం ఆరంభించాక, కొద్ది సంవత్సరాల క్రితం ఉద్యోగం మానుకుని క్రియాశీల రాజకీయాలోకి వచ్చారు.

2009లో టిఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్ధి మహేంద్రరెడ్డితో పోటీని ఎదుర్కొని  స్వల్ప ఆధిక్యతతో గెలిచిన  కెటిఆర్‌ ఆ తర్వాత తెలంగాణ సాధనలో  భాగంగా పదవికి రాజీనామా చేసి బారీ ఆధిక్యతతో గెలుపొందారు. తిరిగి 2014 సాధారణ ఎన్నికలలో 53004 ఓట్ల మెజార్టీతో విజయ డంఖా మోగించారు. 2018లో ఈ మెజార్టీ ఇంకా పెరిగింది. కెటిఆర్‌తో పాటు ఆయన తండ్రి కెసిఆర్‌ 2014లో మెదక్‌  జిల్లా గజ్వేల్‌ నుంచి శాసనసభకు, మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందగా, కెటిఆర్‌ సోదరి కవిత నిజామాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించడం విశేషం. కాని ఒకప్పుడు హైదరాబాద్‌కు చెందిన సలావుద్దీన్‌ ఒవైసీ కుటుంబంలోని ముగ్గురికి ఇలాంటి గౌరవం దక్కింది. సలావుద్దీన్‌ 1999లో లోక్‌సభకు ఎన్నిక కాగా, ఆయన పెద్ద కుమారుడు అసద్‌, మరో కుమారుడు అక్బర్‌లు ఇద్దరూ శాసనసభకు ఎన్నియ్యారు, పలు విధాలుగా కెసిఆర్‌ రికార్డులు సృష్టించిన కెసిఆర్‌ ఈ రకంగా కూడా రికార్డు సొంతం చేసుకున్నారు.

2018లో మాత్రం కవిత ఓటమి చెందారు. సీనియర్‌ నేత, ఏబై ఏళ్ళకాలంలో ఆరుసార్లు గెలుపొంది, 1957లోను, అలాగే 2007లోను అంటే ఏభై ఏళ్ళ తరువాత రాష్ట్ర శాసనసభలో ఉన్న ఏకైక నేతగా గుర్తింపు పొందిన చెన్నమనేని రాజేశ్వరరావు సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన గెలిచారు. ఈయన చొప్పదండిలో ఒకసారి పిడిఎఫ్‌ పక్షాన గెలిచారు. రాజేశ్వరరావు కుమారుడు రమేష్‌ వేములవాడలో పోటీచేసి నాలుగో సారి గెలుపొందారు. రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని విద్యా సాగరరావు మెట్పల్లి నుంచి మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు కరీంనగర్‌నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

2014 ఎన్నికల తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌ అయ్యారు. 1952లో ఇక్కడ గెలిచిన జోగినపల్లి ఆనందరావు 1957లో మెట్పల్లిలో గెలిచారు. 1989లోజనశక్తి నక్సల్‌గ్రూపు తరుఫున ఎస్‌.వి.కృష్ణయ్య గెలిచారు.సిరిసిల్ల 1952,57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్‌. ఎస్‌.టి.ఎఫ్‌ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి మూడుసార్లు, కమ్యూనిస్టు పార్టీ నాలుగుసార్లు,  టిడిపి ఒకసారి, టిఆర్‌ఎస్‌ నాలుగుసార్లు, మరోసారి ఇండిపెండెంటు గెలిచారు. సిరిసిల్ల నుంచి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందగా, ఒకసారి రెడ్డి,రెండుసార్లు ఎస్‌.సి, ఒకసారి బ్రాహ్మణ వర్గం నేత ఎన్నికయ్యారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement