మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గం
మానకొండూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో ప్రముఖ గాయకుడు, తెలంగాణ సాంస్కతిక సంస్థ చైర్మన్ రసమయి బాలకిషన్ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పై 31509 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రసమయికి 88997 ఓట్లు వస్తే, మోహన్‌కు 57488 ఓట్లు వచ్చాయి. కాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోహన్ కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి టిక్కెట్‌పై పోటీచేసిన ఎమ్. ప్రబాకర్‌కు 13600 ఓట్లు దక్కాయి. 2014లో కూడా బాలకిషన్, మోహన్‌ల మద్యే పోటీ జరిగింది. 2009లో గెలిచి శాసనసభలో విప్‌గా పనిచేసిన ఆరేపల్లి మోహన్‌ను 2014లో రసమయి 46922 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణకు 23627 ఓట్లు వచ్చాయి.
నేరెళ్ల (2009లో రద్దు) నేరెళ్ల నియోజకవర్గం 2009లో రద్దయిపోయింది. 2004 వరకు ఉన్న ఈ నియోజకవర్గంలో గొట్టె భూపతి రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలిస్తే, పాటి రాజం కాంగ్రెస్‌ఐ అభ్యర్ధిగా మూడుసార్లు గెలిచారు. 1994,1999లో ఇక్కడ నుంచి గెలిచిన సుద్దాల దేవయ్య 2009లో చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పాటి రాజం గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లలో పనిచేసారు. సుద్దాల దేవయ్య చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2004లో ఎన్నికైన కాశీపేట లింగయ్య టిఆర్‌ఎస్ అసమ్మతి నేతగా మారారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కుమద్దతు ఇచ్చి విఫ్ ఉల్లంఘన అభియోగానికి గురై శాసనసభ్యత్వానికి అనర్హులవడం రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. అయితే తీర్పు రావడానికి ఒక రోజు ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. పాస్‌పోర్టు కుంభకోణానికి సంబంధించి కూడా లింగయ్య అరెస్టు అయ్యారు. నేరెళ్లలో పదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు టిడిపి రెండు సార్లు, టీఆర్‌ఎస్ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు.
మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment