కరీంనగర్ నియోజకవర్గం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరోసారి అంటే మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది , బిజెపి నేత బండి సంజయ్ మీద 14974 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. కాగా కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆయనకు 38500 ఓట్లు వచ్చాయి. కమలాకర్ 2009లో టిడిపి పక్షాన గెలిచారు. తదుపరి ఆయన టిఆర్‌ఎస్ లో కి మారి మరో రెండుసార్లు గెలుపొందారు. గంగులకు 80983 ఓట్లు రాగా, సంజయ్‌కు 66009 ఓట్లు వచ్చాయి.2018లో గెలిచిన తర్వాత కమలాకర్‌కు మంత్రి పదవి దక్కింది. కాగా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో కసభ ఎన్నికలలో బిజెపి పక్షాన పోటీచేసి సంచలన విజయం సాదించారు. కమలాకర్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేత.
గతంలో కరీంనగర్‌లో అత్యధికంగా వెలమ సామాజికవర్గం నేతలు గెలుపొందినా, మూడుసార్లుగా మున్నూరు కాపు వర్గానికి చెందిన గంగుల గెలుపొందారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన గంగుల గెలవడంతో ఇక్కడ బిసిలు మొత్తం మూడుసార్లు గెలిచినట్లయింది.తొమ్మిది సార్లు వెలమ సామాజికవర్గం నేతలు ఇక్కడ గెలిస్తే, ఒకసారి రెడ్డి గెలిచారు. ఒకసారి వైశ్య, మరోసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు.1952 నుంచి 15 సార్లు కరీంనగర్ స్థానానికి ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలిస్తే, టిడిపి ఐదుసార్లు గెలిచింది. పిడిఎఫ్, సోషలిస్టులు ఒక్కోసారి, టిఆర్‌ఎస్ రెండుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు.
2004లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌గౌడ్, తిరిగి కాంగ్రెస్ ఐలో చేరి 2009లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసి టిఆర్‌ఎస్ ఎమ్.పి వినోద్‌ను ఓడిరచడం విశేషం. 1983 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఐ ఒకే ఒక్కసారి 2004లో మాత్రమే గెలిచింది. సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు ఎమ్.సత్యనారాయణరావు గెలిచారు. 1989లో ఇక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన వి.జగపతిరావు 1972లో జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 1999లో టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన కటారి దేవేందర్‌రావు 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత నేత జువ్వాది చొక్కారావు మూడుసార్లు ఇక్కడ నుంచి శాసనసభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి శాసనసభకు ఎన్నికైన ఎమ్.సత్యనారాయణరావు కూడా మూడుసార్లు లోక్‌సభకు గెలుపొందారు. ఇక్కడ నుంచి గెలిచినవారిలో కమలాకర్ 2018 ఎన్నికల తర్వాత కెసీఆర్ క్యాబినెట్‌లో, చొక్కారావు గతంలో జలగం వెంగళరావు క్యాబినెట్‌లో, సి.ఆనందరావు 1989లో ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లోను, ఎమ్.సత్యనారాయణ 2004 తరువాత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో పనిచేశారు. 2007లో టిఆర్‌ఎస్ అదినేత కెసిఆర్‌పై రెచ్చగొట్టే ప్రకటనలు చేసి లోక్‌సభ ఉప ఎన్నికలకు కారకులయ్యారన్న అభిప్రాయం ఉంది. అప్పుడే ఎమ్మెస్సార్ మంత్రి పదవిని వదులుకున్నారు. తదుపరి ఆర్టీసి ఛైర్మన్ పదవితో సంతృప్తి చెందారు.
కరీంనగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment