రామగుండం: ఇక్కడి తీర్పు విలక్షణం.. ఈసారి కార్మికుల కన్ను ఎవరిపై? | Karimnagar: Who Win Next Incumbent In Ramagundam Constituency | Sakshi
Sakshi News home page

రామగుండం: ప్రతిసారి విలక్షణ తీర్పే.. కార్మికుల కన్ను ఎవరిపై?

Published Wed, Aug 16 2023 1:21 PM | Last Updated on Tue, Aug 29 2023 10:54 AM

Karimnagar: Who Win Next Incumbent in Ramagundam Constituency - Sakshi

రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. కార్మికులు ఎవరిని పాపం అంటే వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇక్కడ కార్మిక నాడి ఎవరికీ అంతుపట్టదు. 2004 వరకు మేడారం నియోజకవర్గం 2009లో రామగుండం నియోజకవర్గంగా మారింది. 

2009లో జనరల్ సీట్‌గా మారిన రామగుండం నియోజకవర్గంలో 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కార్మికులు గెలిపించుకున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన సత్యనారాయణ.. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సత్యనారాయణ 2014లో టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు.

2018 ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా కోరుకంటి చందర్‌ సత్యనారాయణపై వెయ్యి ఓట్లతో  విజయం సాధించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. రామగుండం ముఖచిత్రం రామగుండం నియోజకవర్గంలో గతంలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు రామగుండం మండలం ఉండేది. కొత్తజిల్లాల విభజన తర్వాత రామగుండం కార్పోరేషన్‌తో పాటు అంతర్గాం మండలంలో 14 గ్రామాలు  ఉన్నాయి .

► రామగుండం కార్పోరేషన్లో 50 డివిజన్లు, పాలకుర్తి అంతార్గం రామగుండం లో 2018 ఆగస్టు వరకు లక్ష 61 వేల 850 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుషులు 83,458, స్తీలు 78,368 కాగా గత ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల పైచిలుకు ఉంటే అందులో 60 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం లక్ష 61 వేల 850 మంది మాత్రమే ఓట్లు ఉన్నాయి.

సామాజిక వర్గాల
రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పద్మశాలి గౌడ కాపు పెరిక ముదిరాజ్ చాకలి కులస్తులు ఉన్నారు.ఇందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే బలంగా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో ఓట్ల శాతం తక్కువగా నమోదవుతున్నాయి.

ఎమ్మెల్యే బలం బలహీనతలు

  • ప్రజల్లో ఉద్యమకారునిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాలు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేలు ఇరకాటంలోకి నెట్టు తున్నాయి. ఇసుక దందా బూడిద దందా తో పాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జనంలో ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉంది.
  • పార్టీలో మొదటి నుండి పని చేసిన ఉద్యమకారులను ద్వితీయ శ్రేణి నాయకులను తొక్క పెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
  • బీఆర్‌ఎస్‌ నాయకులు కందుల సంధ్యారాణి, మిర్యాల రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేల తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.

నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు

  • ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ రావడం వల్ల సప్తగిరి కాలనీ, న్యూ మారేడుపల్లి ప్రధాన సమస్యగా మారాయి. నీటిలో ఇండ్లు మునిగిన గాని ఇప్పటివరకి సమస్య సమస్యగానే ఉంది.పనులు ఎక్కడ వేసిన గొంగలి లా ఉన్నాయి.
  • బీఆర్.ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు వ్యతిరేక వర్గీయులు పోరాటాలు ఈసారి ఎమ్మెల్యేకు మైనస్గా మారే అవకాశం. ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీల ఓటు  బ్యాంకు కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండవచ్చు.
  • ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు!

బీఆర్ఎస్ 

  • కోరుకంటి చందర్

కాంగ్రెస్ పార్టీ  

  • రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్
  • జనక్ ప్రసాద్ ( ఐ.ఎన్.టి.యు. సి.)

బీజెపి

  • సోమరపు సత్యనారాయణ (మాజీ ఆర్టీసీ చైర్మన్)
  • కౌశిక్ హరి
  • కాసిపేట లింగయ్య (మాజీ ఎమ్మెల్యే)

భౌగోళిక పరిస్థితులు:

  • రామగుండం నియోజకవర్గంలో రాముని గుండాలు ఇక్కడ ప్రత్యేకం 
  • జనగామ శివారులో 500 సంవత్సారాల క్రితం ఉన్నా త్రిలింగ రాజరాజేశ్వర స్వామి మూడు లింగాలు ఉండడం ఇక్కడి  ప్రత్యేకం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement