Ramagundam Assembly Constituency
-
రామగుండం: ఇక్కడి తీర్పు విలక్షణం.. ఈసారి కార్మికుల కన్ను ఎవరిపై?
రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. కార్మికులు ఎవరిని పాపం అంటే వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇక్కడ కార్మిక నాడి ఎవరికీ అంతుపట్టదు. 2004 వరకు మేడారం నియోజకవర్గం 2009లో రామగుండం నియోజకవర్గంగా మారింది. ► 2009లో జనరల్ సీట్‌గా మారిన రామగుండం నియోజకవర్గంలో 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కార్మికులు గెలిపించుకున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన సత్యనారాయణ.. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన సత్యనారాయణ 2014లో టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. ► 2018 ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా కోరుకంటి చందర్ సత్యనారాయణపై వెయ్యి ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. రామగుండం ముఖచిత్రం రామగుండం నియోజకవర్గంలో గతంలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు రామగుండం మండలం ఉండేది. కొత్తజిల్లాల విభజన తర్వాత రామగుండం కార్పోరేషన్‌తో పాటు అంతర్గాం మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి . ► రామగుండం కార్పోరేషన్లో 50 డివిజన్లు, పాలకుర్తి అంతార్గం రామగుండం లో 2018 ఆగస్టు వరకు లక్ష 61 వేల 850 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుషులు 83,458, స్తీలు 78,368 కాగా గత ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల పైచిలుకు ఉంటే అందులో 60 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం లక్ష 61 వేల 850 మంది మాత్రమే ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పద్మశాలి గౌడ కాపు పెరిక ముదిరాజ్ చాకలి కులస్తులు ఉన్నారు.ఇందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే బలంగా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో ఓట్ల శాతం తక్కువగా నమోదవుతున్నాయి. ఎమ్మెల్యే బలం బలహీనతలు ప్రజల్లో ఉద్యమకారునిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాలు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేలు ఇరకాటంలోకి నెట్టు తున్నాయి. ఇసుక దందా బూడిద దందా తో పాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జనంలో ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉంది. పార్టీలో మొదటి నుండి పని చేసిన ఉద్యమకారులను ద్వితీయ శ్రేణి నాయకులను తొక్క పెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి, మిర్యాల రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేల తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ రావడం వల్ల సప్తగిరి కాలనీ, న్యూ మారేడుపల్లి ప్రధాన సమస్యగా మారాయి. నీటిలో ఇండ్లు మునిగిన గాని ఇప్పటివరకి సమస్య సమస్యగానే ఉంది.పనులు ఎక్కడ వేసిన గొంగలి లా ఉన్నాయి. బీఆర్.ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు వ్యతిరేక వర్గీయులు పోరాటాలు ఈసారి ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం. ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండవచ్చు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు! బీఆర్ఎస్ కోరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాగూర్ మక్కాన్‌సింగ్ జనక్ ప్రసాద్ ( ఐ.ఎన్.టి.యు. సి.) బీజెపి సోమరపు సత్యనారాయణ (మాజీ ఆర్టీసీ చైర్మన్) కౌశిక్ హరి కాసిపేట లింగయ్య (మాజీ ఎమ్మెల్యే) భౌగోళిక పరిస్థితులు: రామగుండం నియోజకవర్గంలో రాముని గుండాలు ఇక్కడ ప్రత్యేకం జనగామ శివారులో 500 సంవత్సారాల క్రితం ఉన్నా త్రిలింగ రాజరాజేశ్వర స్వామి మూడు లింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకం. -
పెద్దపల్లి రామగుండం నియోజకవర్గ రాజకీయ చరిత్ర
రామగుండం నియోజకవర్గం రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే, ఆర్టిసీ చైర్మన్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ ఓటమి చెందగా, టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ది పార్వర్డ్ బ్లాక్ టిక్కెట్ పై పోటీచేసిన కురుగంటి చందర్ విజయం సాదించారు. చందర్ 2014 ఎన్నికలలో పోటీపడి ఓడిపోయారు.కాని 2018 ఎన్నికలలో విజయం సాధించగలిగారు. ఆ తర్వాత చందర్ టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. చందర్‌కు 61400 ఓట్లు రాగా, సోమారపు సత్య నారాయణకు 34981 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే చందర్‌కు 26419 ఓట్ల మెజార్టీ రావడం ఒక ప్రత్యేకతగా భావించాలి. కాగా ఇక్కడ కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ఇరవైఆరువేలకు పైగా ఓట్లు వచ్చాయి. చందర్ మున్నూరుకాపు వర్గానికిచెందిన నేత. రామగుండం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009 ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందిన సోమారపు సత్యనారాయణ 2014లో టిఆర్ఎస్ పక్షాన గెలిచారు. 2009లో గెలిచిన తర్వాత కొంతకాలం కాంగ్రెస్ ఐలో ఉన్నా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రం అవడంతో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. గతంలో రామగుండం, మేడారం రిజర్వుడ్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. మేడారంలో పదిమంది ఎస్.సి.నేతలు గెలుపొందగా, జనరల్‌గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్లు గెలిచారు. మేడారం నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి నాలుగు సార్లు, టిడిపి మూడుసార్లు, టీఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. మేడారం, రామగుండం ఒకే నియోజకవర్గంగా భావిస్తే, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచినట్లవుతుంది. 1983లో ఇక్కడ గెలిచిన మాతంగి నరసయ్య 1989లో కాంగ్రెస్ఐ పక్షాన, 1999లో టిడిపి తరుపున గెలుపొందారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కరరావు గ్రూపులోను, 1996లో ఎన్.టి.ఆర్ టిడిపి పక్షాన ఉన్నారు. 1985లో మేడారంలో గెలిచిన మాలం మల్లేషం 1994లో కూడా గెలుపొందారు. 1972, 78లలో జి.ఈశ్వర్ గెలిచారు. ఈయన సీనియర్‌నేత, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన వెంకటస్వామికి సమీప బంధువు 1967లో ఇక్కడ గెలిచిన గడిపల్లి రాములు 1957,62లలో హుజూరాబాద్‌లో విజయం సాధించారు. మాతంగి నరసయ్య 1984లో నాదెండ్ల వెంట ఉన్నప్పుడు నెలరోజుల మంత్రిగా పనిచేసారు. మేడారం జనరల్ స్థానంగా ఉన్నప్పుడు 1962లో ఎమ్. రామగోపాలరెడ్డి ఇండిపెండెంటుగా గెలిచారు. ఈయన నిజామాబాదు నుంచి మూడుసార్లు లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. రామగుండం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..