Somarapu satayanarayana
-
రామగుండం: ఇక్కడి తీర్పు విలక్షణం.. ఈసారి కార్మికుల కన్ను ఎవరిపై?
రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. కార్మికులు ఎవరిని పాపం అంటే వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇక్కడ కార్మిక నాడి ఎవరికీ అంతుపట్టదు. 2004 వరకు మేడారం నియోజకవర్గం 2009లో రామగుండం నియోజకవర్గంగా మారింది. ► 2009లో జనరల్ సీట్‌గా మారిన రామగుండం నియోజకవర్గంలో 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కార్మికులు గెలిపించుకున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన సత్యనారాయణ.. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన సత్యనారాయణ 2014లో టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. ► 2018 ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా కోరుకంటి చందర్ సత్యనారాయణపై వెయ్యి ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. రామగుండం ముఖచిత్రం రామగుండం నియోజకవర్గంలో గతంలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు రామగుండం మండలం ఉండేది. కొత్తజిల్లాల విభజన తర్వాత రామగుండం కార్పోరేషన్‌తో పాటు అంతర్గాం మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి . ► రామగుండం కార్పోరేషన్లో 50 డివిజన్లు, పాలకుర్తి అంతార్గం రామగుండం లో 2018 ఆగస్టు వరకు లక్ష 61 వేల 850 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుషులు 83,458, స్తీలు 78,368 కాగా గత ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల పైచిలుకు ఉంటే అందులో 60 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం లక్ష 61 వేల 850 మంది మాత్రమే ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పద్మశాలి గౌడ కాపు పెరిక ముదిరాజ్ చాకలి కులస్తులు ఉన్నారు.ఇందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే బలంగా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో ఓట్ల శాతం తక్కువగా నమోదవుతున్నాయి. ఎమ్మెల్యే బలం బలహీనతలు ప్రజల్లో ఉద్యమకారునిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాలు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేలు ఇరకాటంలోకి నెట్టు తున్నాయి. ఇసుక దందా బూడిద దందా తో పాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జనంలో ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉంది. పార్టీలో మొదటి నుండి పని చేసిన ఉద్యమకారులను ద్వితీయ శ్రేణి నాయకులను తొక్క పెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి, మిర్యాల రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేల తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ రావడం వల్ల సప్తగిరి కాలనీ, న్యూ మారేడుపల్లి ప్రధాన సమస్యగా మారాయి. నీటిలో ఇండ్లు మునిగిన గాని ఇప్పటివరకి సమస్య సమస్యగానే ఉంది.పనులు ఎక్కడ వేసిన గొంగలి లా ఉన్నాయి. బీఆర్.ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు వ్యతిరేక వర్గీయులు పోరాటాలు ఈసారి ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం. ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండవచ్చు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు! బీఆర్ఎస్ కోరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాగూర్ మక్కాన్‌సింగ్ జనక్ ప్రసాద్ ( ఐ.ఎన్.టి.యు. సి.) బీజెపి సోమరపు సత్యనారాయణ (మాజీ ఆర్టీసీ చైర్మన్) కౌశిక్ హరి కాసిపేట లింగయ్య (మాజీ ఎమ్మెల్యే) భౌగోళిక పరిస్థితులు: రామగుండం నియోజకవర్గంలో రాముని గుండాలు ఇక్కడ ప్రత్యేకం జనగామ శివారులో 500 సంవత్సారాల క్రితం ఉన్నా త్రిలింగ రాజరాజేశ్వర స్వామి మూడు లింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకం. -
టీఆర్ఎస్ లో కొనసాగుతున్న సస్పెన్షన్లు
సాక్షి, పెద్దపల్లి : ఎన్నికల సమయంలో రామగుండం టీఆర్ఎస్లో వేటు పర్వం కొనసాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులను వరుసగా సస్పెండ్ చేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. అధినేత కేసీఆర్ గోదావరిఖని పర్యటనకు కొన్ని గంటల ముందు పార్టీ ఈ సస్పెన్షన్ల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న సస్పెన్షన్లు పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు రామగుండం టీఆర్ఎస్లో అసమ్మతి వ్యవహారం మరోసారి వెలుగు చూస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ సహా 26 మందిని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మంగళవారం సస్పెండ్ చేశారు. ఇదే కారణంతో టీబీజీకేఎస్ నాయకులు లక్కాకుల లక్ష్మణ్, జలపతి, అల్లి శంకర్లను సస్పెండ్ చేస్తున్నట్లు టీబీజీకేఎస్ నేత టి.వెంకట్రావు బుధవారం ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖనికి రానున్న కొద్దిగంటల ముందు సస్పెన్షన్ల వ్యవహారం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అసమ్మతికి పెట్టింది పేరు. సంవత్సరాలుగా అసమ్మతి కార్యకలాపాలు చోటుచేసుకుంటుండడం, ప్రతిపక్ష పార్టీలకన్నా... సొంత పార్టీ నాయకులే విమర్శించుకోవడం ఇక్కడ సర్వసాధారణం. తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణల నడుమ వర్గపోరు గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. మాజీ మేయర్ వర్గానికి ఎంపీ బాల్క సుమన్ మద్దతుందనే ప్రచారమూ జరిగింది. నగరపాలకసంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అసమ్మతి ప్రత్యక్షపోరుకు కారణమైంది. టీఆర్ఎస్ నుంచే రెండు వర్గాలు పోటీపడగా, ఎమ్మెల్యే వర్గం పైచేయి సాధించింది. ఈ క్రమంలోనే అప్పటి మేయర్ లక్ష్మీనారాయణపై సోమారపు వర్గం అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దింపేయించింది. అవిశ్వాసం సమయంలో పార్టీ అధిష్టానాన్ని సైతం తనతో వచ్చేట్లు చేయడంలో సోమారపు సఫలమయ్యారు. అవిశ్వాసాన్ని నిలిపివేయాలన్న అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించి, ఏకంగా ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. చివరకు అధిష్టానం అంగీకరించడంతో లక్ష్మీనారాయణను పదవి నుంచి దింపి తనపంతం నెగ్గించుకున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఉద్యమనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోరుకంటి చందర్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఈ సారికూడా సిట్టింగ్‌లకే టికెట్ దక్కడంతో చందర్ ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో అసమ్మతి నేత పెద్దంపేట శంకర్ బీఎస్పీ నుంచి రంగంలో ఉన్నారు. రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి రెబల్‌గా పోటీకి సిద్ధపడ్డా.. చివరకు కోరుకంటి చందర్‌కు మద్దతుగా పోటీనుంచి తప్పుకున్నారు. సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్‌లు పోటీపడుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా రెండుగా విడిపోయారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థికి కాకుండా, రెబల్ అభ్యర్థికి మద్దతునిస్తున్న నాయకులపై పార్టీపరంగా చర్యలు ప్రారంభించారు. జెడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ మేయర్ లక్ష్మీనారాయణలతో పాటు 26 మంది నాయకులను సోమారపు సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బుధవారం టీబీజీకేఎస్ నాయకులు ముగ్గురిపై కూడా వేటువేశారు. పార్టీ అభ్యర్థినైన తనకుకాకుండా.. తిరుగుబాటు అభ్యర్థికి మద్దతుగా ఉన్న నాయకులపై పార్టీపరంగా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంవత్సరాలుగా తారాస్థాయిలో ఉన్న అసమ్మతి, కీలక ఎన్నికల వేళ సస్పెన్షన్లకు కారణమవుతుండడంతో, మరోసారి అసమ్మతిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. నియోజకవర్గ చరిత్ర కోసం మరిన్ని వార్తలు... -
సోమారపు డప్పు... ప్రచారం ఊపు
సాక్షి, రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచార నిమిత్తం వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ డప్పు చేతపట్టి స్టెప్పులేయడంతో అందరిలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. అదే విధంగా ఆయన ఫొటోతో ఉన్న మాస్క్‌లను ధరించి పలువురు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేపట్టడం అందరినీ ఆకట్టుకుంది. -
టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు
♦ ఫైల్‌పై సంతకం చేసిన కేసీఆర్ ♦ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ♦ అధికార భాషా సంఘం చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు ♦ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా మల్లెపల్లి లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ముందే నామినేటెడ్ పదవుల వడ్డన మొదలైంది. మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకంతో పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం మరో నలుగురికి కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ఫైల్‌పై సంతకం చేశారు. అలాగే తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని నియమించి కేబినెట్ హోదా కల్పించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అందుకే కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు స్వయంగా సీఎం చైర్మన్‌గా ఉన్నారు. కొత్తగా నియమించిన వైస్ చైర్మన్ పదవీ కాలం మూడేళ్లు ఉంటుం దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్‌రావును తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. కేబినెట్ హోదాతో పాటు ఈ పదవీ కాలం ఏడాదిపాటు ఉంటుందని సాధారణ పరిపాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా సీనియర్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కో-ఆర్డినేటర్ మల్లేపల్లి లక్ష్మయ్యను నియమిస్తూ పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులను ఆకర్షించేలా బౌద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు స్పెషలాఫీసర్‌తో పాటు పాలకవర్గ కమిటీ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులతో ఈ కమిటీని నియమించే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించింది. తమకు బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రావు సచివాలయం లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.