![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/26/NRI%20Voters%20111.jpg.webp?itok=Tji1tNoW)
సాక్షి, కరీంనగర్: 'ఏ దేశమేగినా ఎక్కడున్నా ఓటే తమ అభిమతమని చాటుతున్నారీ యువత. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగమే తమ నినాదమని ధీమాగా చెబుతున్నారు. బాల్య వయసులో పాఠ్యాంశంలోని అంశాలు, యువ వయసులో జిల్లా, రాష్ట్ర, జాతీయ రాజకీయాలను గమనిస్తున్న సదరు యువత ఓటెత్తుతామని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో ఉపాధి పొందుతున్నారు.
ఏళ్లుగా అక్కడే స్థిరపడగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలొచ్చాయంటే స్వదేశీబాట పడుతున్నారు. జిల్లా నుంచి వేల సంఖ్యలో అమెరికా, స్విట్జర్లాండ్, లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, రష్యా తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. సదరు దేశాల్లో ఓటు ప్రాధాన్యమెక్కు వ. ఓటేయకుంటే శిక్షలున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల క్రమంలో వందల మంది కరీంనగర్‌కు చేరుకోగా.. ఓటేసేందుకు మేమొచ్చాం.. మీరు ఓటేసేందుకు వస్తారుగా అంటూ సహచర స్నేహితులను చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా వారి వాయిస్ వినిపించారు.'
రాజకీయాలంటే ఆసక్తి!
అమెరికాలోని పెన్సుల్‌వెనియా ప్రాంతంలో స్థిరపడిన ఉనుకొండ రాజీవ్‌కుమార్‌ది నగరంలోని విద్యానగర్. సాఫ్ట్‌వేర్ రంగంలో రాణిస్తున్నాడు. కంపెనీ అమెరికాలో అవకాశం కల్పించగా.. తన ప్రతిభతో అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నికలొచ్చాయంటే రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటాడు. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల నేర చరిత్ర తదితర వివరాలను ఆరా తీస్తూనే ప్రచార సరళిని పరిశీలిస్తుంటాడు. తీరా పోలింగ్ సమయానికి భారత్ రావడం.. ఓటేయడం ప్రతీసారి చేస్తుంటానని, ఇటీవలే మన దేశానికి వచ్చానని చెబుతున్నారు రాజీవ్.
Comments
Please login to add a commentAdd a comment