కొత్తపేట చౌరస్తా వద్ద నిరసనకు దిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు
హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఒక్కమారుగా బహిర్గతమయ్యాయి. తీగల కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించటంపై నిరసనలు వ్యక్తం చేస్తూ కొత్త మనోహర్ రెడ్డి అనుచరులు మంగళవారం కొత్తపేట చౌరస్తా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. టీఆర్‌ఎస్ పార్టీ మహేశ్వరం యూత్ అధ్యక్షుడు చిక్కుళ్ళ శివప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి తీగలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఆందోళనతో కొత్తపేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకు ట్రాఫిక్ జామ్ కాగా పోలీస్‌లు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనంతరం చిక్కుళ్ళ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఏం చేశారని, తీగలకు తిరిగి టికెట్ ఇవ్వటం దారుణమన్నారు. తమ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతారని ఛాలెంజ్ చేశారు. కొత్త మనోహర్ రెడ్డిని ఇండిపెండెంట్‌గా గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు. తీగల కృష్ణారెడ్డి ఆర్‌కెపురం లో తన కోడల్ని కార్పొరేటర్‌గా గెలిపించుకోలేకపోయారని, ఇటువంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించా రు. కార్యక్రమంలో మేకల రవీందర్ రెడ్డి, పాశం ప్రవీణ్ రెడ్డి, వేద భవాని, లలిత, లక్ష్మి, భాస్కర్, నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment